For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RCB vs KKR Dream11 Prediction: డ్రీమ్11 టీమ్..కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్! హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఇవే!!

RCB vs KKR Dream11 Prediction: Fantasy Cricket Tips, Dream11 Team and Playing XI for Eliminator Match

హైదరాబాద్: ఐపీఎల్ 2021లో మరో ఆసక్తికరమైన సమరానికి సమయం దగ్గరపడుతోంది. ఐపీఎల్ 14వ సీజన్ లీగ్ దశ ముగిసే సమయానికి పాయింట్ల పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో నిలవడం ద్వారా ప్లే ఆఫ్స్‌కి చేరిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌ రైడర్స్ అమితుమీ తేల్చుకోనున్నాయి. షార్జా క్రికెట్ మైదానంలో ఈరోజు రాత్రి 7.30 గంటలకి ఎలిమినేటర్ మ్యాచ్ ఆరంభం కానుండగా.. టాస్ 7 గంటలకు పడనుంది. ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. అలాగే డిస్నీ+హాట్‌స్టార్ యాప్‌లోనూ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు బుధవారం షార్జా వేదికగానే ఢిల్లీ క్యాపిటల్స్‌తో క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో ఆడనుంది. ఓడిన జట్టు మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమించనుంది. దాంతో మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది.

రికార్డ్స్ అండ్ పిచ్ రిపోర్ట్:

రికార్డ్స్ అండ్ పిచ్ రిపోర్ట్:

ఐపీఎల్ 2021 లీగ్‌ దశలో ఆడిన మ్యాచ్‌ల్లో బెంగళూరు, కోల్‌కతా జట్లు చెరో విజయం సాధించాయి. 14 మ్యాచ్‌ల్లో 9 విజయాలతో 18 పాయింట్లు సాధించి మూడో స్థానంతో ఆర్‌సీబీ ముందంజ వేయగా.. ఏడింట్లో నెగ్గిన కేకేఆర్‌ 14 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టిన చివరి జట్టుగా నిలిచింది. ఐపీఎల్ టోర్నీలో ఈ రెండు జట్లు ఇప్పటి వరకూ 28 మ్యాచ్‌ల్లో ముఖాముఖి పోరులో తలపడ్డాయి. ఇందులో కోల్‌కతా 15 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. 13 మ్యాచ్‌ల్లో బెంగళూరు గెలిచింది. ఇక చివరిగా ఆడిన నాలుగు మ్యాచ్‌లకిగానూ మూడింట్లో బెంగళూరు గెలుపొందింది. ప్లే ఆఫ్స్ అనుభవంపరంగా చూసుకున్నా బెంగళూరు కంటే కోల్‌కతా ముందజలో ఉంది. కోల్‌కతా రెండు సార్లు ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలవగా.. బెంగళూరు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది. ఇక షార్జా పిచ్‌ నెమ్మదిగా స్పందిస్తోంది. ఈ సీజన్‌లో ఇక్కడ జరిగిన 8 మ్యాచ్‌ల్లో రెండు సార్లు మాత్రమే ఓ ఇన్నింగ్స్‌లో 160కి పైగా స్కోర్లు నమోదయ్యాయి. టాస్‌ గెలిచిన జట్టు ఛేదనకే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. మ్యాచుకు ఎలాంటి వర్షపు ముప్పు లేదు.

 కెప్టెన్లకు సవాలే:

కెప్టెన్లకు సవాలే:

ఈ సీజన్ తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్న విరాట్ కోహ్లీ నేతృత్వంలో 2016లో బెంగళూరు ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకుంది. విరాట్ నాయకత్వంలో బెంగళూరు జట్టు 2015, 2020లో కూడా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది. ఇప్పుడు కోహ్లీ టైటిల్‌ గెలిచి కెప్టెన్సీ నుంచి దర్జాగా తప్పుకోవాలని చూస్తున్నాడు. మరోవైపు కోల్‌కతా జట్టు ఇటీవల కోల్పోయిన ఖ్యాతిని తిరిగి పొందడం ఇయాన్ మోర్గాన్‌కు పెద్ద సవాలు లాంటిదే అని చెప్పాలి. మోర్గాన్ ఇంగ్లండ్ జట్టుకు 2019 ప్రపంచకప్ అందించినా.. ఆ తర్వాత నాయకత్వంలో తేలిపోతున్నాడు. దాంతో ఈ మ్యాచ్ అతడికి పరీక్షే. 2012 , 2014 మధ్య మూడు సంవత్సరాలలో గౌతమ్ గంభీర్ నాయకత్వంలో కోల్‌కతా రెండుసార్లు టైటిల్ గెలుచుకుంది.

 జోరుమీదున్న ఇరు జట్లు:

జోరుమీదున్న ఇరు జట్లు:

బెంగళూరు ఓపెనర్లు దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీలు పరుగులు చేస్తున్నారు. కోన శ్రీకర్‌ భరత్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఓపెనర్లతో పాటు భరత్‌ కూడా చెలరేగితే.. బెంగళూరుకు తిరుగుండదు. స్టార్ ఆటగాళ్లు ఏబీ డివిలియర్స్, గ్లెన్ మాక్స్‌వెల్ రెండో దశలో పూర్తిగా విఫలమయినా.. ఢిల్లీపై చెలరేగారు. షాబాజ్‌ అహ్మద్, డేనియల్ క్రిస్టియన్‌లతో ఆర్‌సీబీ బ్యాటింగ్ విభాగం పటిష్టంగా ఉంది. ఇక బౌలింగ్‌లో అత్యధిక వికెట్ల వీరుడిగా కొనసాగుతున్న హర్షల్‌ పటేల్ (30)తో పాటు మొహ్మద్ సిరాజ్‌, జార్జ్ గార్టన్‌ల పేస్‌ త్రయం ప్రత్యర్థికి సవాలు విసిరేదే. స్పిన్నర్‌ యుజ్వేంద్ర చహల్‌ బంతితో మాయ చేస్తున్నాడు. మరోవైపు కోల్‌కతా బ్యాటింగ్‌లో భారత కుర్రాళ్లు శుభ్‌మన్‌ గిల్, వెంకటేశ్‌ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, నితీశ్‌ రాణా కీలకంగా మారారు. స్పిన్నర్లు వరుణ్‌ చక్రవర్తి, సునీల్ నరైన్‌, షకీబ్‌ ఉల్ హాసన్‌తో పాటు పేసర్లు లాకీ ఫెర్గూసన్‌, శివమ్‌ మావీ జోరుమీదున్నారు.

తుది జట్లు (అంచనా)

తుది జట్లు (అంచనా)

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు: దేవ్‌దత్‌ పడిక్కల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), కేఎస్ భరత్‌, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌, ఏబీ డివిలియర్స్‌, షాబాజ్‌ అహ్మద్, డేనియల్ క్రిస్టియన్‌, జార్జ్ గార్టన్‌, హర్షల్‌ పటేల్, మొహ్మద్ సిరాజ్‌, యుజ్వేంద్ర చహల్‌.

కోల్‌కతా నైట్‌ రైడర్స్: శుభ్‌మన్‌ గిల్, వెంకటేశ్‌ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, నితీశ్‌ రాణా, దినేశ్‌ కార్తీక్‌, ఇయాన్ మోర్గాన్‌ (కెప్టెన్), వరుణ్‌ చక్రవర్తి, సునీల్ నరైన్‌, షకీబ్‌ ఉల్ హాసన్‌, లాకీ ఫెర్గూసన్‌, శివమ్‌ మావీ.

డ్రీమ్ 11 టీమ్:

డ్రీమ్ 11 టీమ్:

శుభ్‌మన్‌ గిల్, రాహుల్ త్రిపాఠి, దేవ్‌దత్‌ పడిక్కల్, కోన శ్రీకర్ భరత్ (కీపర్), విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ (కెప్టెన్), వెంకటేశ్ అయ్యర్ (వైస్ కెప్టెన్), డేనియల్ క్రిస్టియన్, హర్షల్ పటేల్, లాకీ ఫెర్గూసన్, శివమ్ మావి.

Story first published: Monday, October 11, 2021, 15:23 [IST]
Other articles published on Oct 11, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+