Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCB vs GT: విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో: మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్ (Video)

చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సత్తాచాటింది. నాలుగు వికెట్ల తేడాతో గెలిచి ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. పాయింట్ల పట్టికలో అట్టడుగన నుంచి ఏడో స్థానానికి ఎగబాకింది. మొదట బౌలర్ల క్రమశిక్షణ ప్రదర్శన, ఫీల్డర్ల మెరుపు ఫీల్డింగ్‌తో గుజరాత్‌ను ఆర్సీబీ 19.3 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌట్ చేసింది.

షారుక్ ఖాన్ (37; 24 బంతుల్లో, 5x4, 1x6) టాప్ స్కోరర్. యశ్ దయాల్ (2/21), విజయ్ కుమార్ వైశాక్ (2/23), మహ్మద్ సిరాజ్ (2/29) తలో రెండు వికెట్లతో సత్తాచాటారు. అనంతరం బెంగళూరు 13.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ డుప్లెసిస్ (64; 23 బంతుల్లో, 10x4, 3x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. విరాట్ కోహ్లి (42; 27 బంతుల్లో, 2x4, 4x6) రాణించాడు. గుజరాత్ బౌలర్లలో లిటిల్ (4/45) నాలుగు వికెట్లు తీశాడు.

kohli

అయితే విరాట్ కోహ్లి మెరుపు ఫీల్డింగ్ గుజరాత్ ఇన్నింగ్స్‌ను తలకిందులుగా మార్చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ కు పేలవారంభం లభించింది. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే సిరాజ్ ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా (1; 7 బంతుల్లో), శుభ్‌మన్ గిల్ (2; 7 బంతుల్లో) వరుస ఓవర్ల ఔట్ చేశాడు. సిరాజ్‌కు తోడుగా ఆర్సీబీ ఇతర బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో గుజరాత్ పవర్‌ప్లేలో మూడు వికెట్లు కోల్పోయి 23 పరుగులే చేసింది. ఐపీఎల్‌ చరిత్రలో గుజరాత్‌కు ఇదే అత్యల్ప పవర్‌ప్లే స్కోరు కావడం గమనార్హం.

ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన షారుక్ ఖాన్‌తో కలిసి డేవిడ్ మిల్లర్ (30; 20 బంతుల్లో, 3x4, 2x6) ఇన్నింగ్స్ చక్కదిద్దారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 37 బంతుల్లో 67 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారుతున్న మిల్లర్‌ను కర్ణ్ శర్మ 12వ ఓవర్‌లో ఔట్ చేశాడు. అయినప్పటికీ గుజరాత్ ధైర్యంగానే ఉంది. దానికి కారణం కుదురుకున్న భారీ హిట్టర్ షారుక్ ఖాన్ క్రీజులో ఉన్నాడు. కానీ తర్వాతి ఓవర్‌లోనే గుజరాత్‌కు బిగ్ షాక్ తగిలింది.

కోహ్లి స్టన్నింగ్ ఫీల్డింగ్‌కు షారుక్ ఖాన్ పెవిలియన్‌కు చేరాడు. విజయ్ కుమార్ వైశాక్ వేసిన బంతిని తెవాతియా ఆఫ్‌సైడ్‌కు షాట్ ఆడాడు. మరో ఎండ్‌లో ఉన్న షారుక్ సింగిల్ కోసం ముందుకు వచ్చాడు. కానీ తెవాతియా వద్దని చెప్పడంతో షారుక్ వెనక్కి వెళ్లాడు. అయితే కోహ్లిని చూసుకుంటూ కాస్త బద్దకంగా తిరిగి వెళ్తున్న షారుక్ మెరుపు త్రోకి ఔట్ అయ్యాడు. బంతిని అందుకుని కోహ్లి వికెట్లకు గురిపెట్టాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ 87 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కోలుకోలేకపోయింది.

Story first published: Saturday, May 4, 2024, 23:54 [IST]
Other articles published on May 4, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+