|
రెండు లైఫ్స్‌తో..
ఎలాంటి ఆందోళన లేకుండా చాలా కూల్‌గా ఎంతో ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేశాడు. ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్‌పైనే తన తొలి హాఫ్ సెంచరీ చేసిన విరాట్.. దానికి మించిన జోరును తాజా మ్యాచ్‌లో చూపించాడు. ఇక విరాట్ కోహ్లీకి ఈ మ్యాచ్‌లో లక్ కూడా కలిసొచ్చింది. హార్దిక్ పాండ్యా వేసిన నాలుగో ఓవర్లో విరాట్ వరుస బంతుల్లో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఆ ఓవర్ రెండో బంతి ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకొని వికెట్లకు ఇంచు దూరం నుంచి బౌండరీ వెళ్లింది. మూడో బంతికి విరాట్ కోహ్లీ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్‌ను రషీద్ ఖాన్ నేలపాలు చేశాడు.

భారీ సిక్సర్‌తో..
ఈ లైఫ్స్‌తో రెచ్చిపోయిన కోహ్లీ.. గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఎదురుదాడికి దిగాడు. 44 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రషీద్ వేసిన 10వ ఓవర్ తొలి బంతిని ఓవర్ డీప్ మిడ్ వికెట్ మీదుగా సిక్సర్ బాది 33 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం వినూత్న రితీలో సంబరాలు చేసుకున్నాడు. గాల్లోకి చేతులు చూపిస్తూ... 'ఓరి దేవుడా లవ్యూరా'అంటూ కృతజ్ఞతలు తెలిపాడు. తనకు లక్ ఫేవర్ చేసినందుకు విరాట్ థ్యాంక్స్ చెప్పుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

మ్యాక్సీ మెరుపులతో..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 168 పరుగులు చేసింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (47 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 62 నాటౌట్), మిల్లర్ (25 బంతుల్లో 3 సిక్సర్లతో 34) రాణించారు. అనంతరం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 18.4 ఓవర్లలో 2 వికెట్లే కోల్పోయి 170 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీకి తోడుగా... డుప్లెసిస్ (38 బంతుల్లో5 ఫోర్లతో 44) రాణించాడు. బౌలింగ్‌లో కీలకమైన వికెట్, అద్భుతమైన క్యాచ్ పట్టిన మ్యాక్స్‌వెల్ (18 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40 నాటౌట్) మెరుపు బ్యాటింగ్‌తో జట్టు విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.