Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ తప్పిదమే మా కొంపముంచింది- గిల్

ఐపీఎల్-2023లో రన్నరప్‌గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్‌లో అంచనాలను అందుకోలేకపోతుంది. హ్యాట్రిక్ ఓటములతో ప్లేఆఫ్స్ ఆవకాశాలను సంక్లిష్టం చేసుకుంటుంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ నాలుగు వికెట్ల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానానికి పడిపోయింది.

మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 19.3 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. షారుక్ ఖాన్ (37; 24 బంతుల్లో, 5x4, 1x6), రాహుల్ తెవాతియా (35; 21 బంతుల్లో, 5x4, 2x6), డేవిడ్ మిల్లర్ (30; 20 బంతుల్లో, 3x4, 2x6) పరుగులు సాధించారు. యశ్ దయాల్ (2/21), విజయ్ కుమార్ వైశాక్ (2/23), మహ్మద్ సిరాజ్ (2/29) తలో రెండు వికెట్లతో సత్తాచాటారు.

RCB vs GT the powerplay that made a difference in result- Shubman Gill

అనంతరం బెంగళూరు 13.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. పవర్‌ప్లేలో (92/1)నే ఆర్సీబీ విజయం ఖరారైంది. కానీ ఆ తర్వాత గుజరాత్ బౌలర్లు పుంజుకుని 25 పరుగుల వ్యవధిలోనే ఆరు వికెట్లు పడగొట్టింది. అయినప్పటికీ మోస్తారు టార్గెట్ కావడంతో బెంగళూరు సునాయాసంగా విజయం తీరాలకు చేరింది. కెప్టెన్ డుప్లెసిస్ (64; 23 బంతుల్లో, 10x4, 3x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. విరాట్ కోహ్లి (42; 27 బంతుల్లో, 2x4, 4x6) రాణించాడు. గుజరాత్ బౌలర్లలో లిటిల్ (4/45) నాలుగు వికెట్లు తీశాడు.

కాగా, మ్యాచ్ అనంతరం ఓటమికి గల కారణాలను గిల్ వివరించాడు. పవర్‌ప్లేలో బ్యాటింగ్, బౌలింగ్‌లో దారుణ వైఫల్యమే ఓటమికి ప్రధాన కారణమని గిల్ అభిప్రాయపడ్డాడు. పవర్‌ప్లేలో గుజరాత్ 23/3 స్కోరు మాత్రమే చేసింది. ఐపీఎల్‌లో గుజరాత్‌కు ఇదే అత్యల్ప పవర్‌ప్లే స్కోరు. మరోవైపు ఆర్సీబీ పవర్‌ప్లే‌లో 92/1తో నిలిచింది. ఐపీఎల్‌లో బెంగళూరుకు ఇదే అత్యధిక పవర్‌ప్లే స్కోరు కావడం గమనార్హం.

''సరిపోయే టార్గెట్ అనేది పిచ్‌ను బట్టి ఆధారపడి ఉంటుంది. ప్రారంభంలో కొన్ని ఓవర్లును చూశాక, ఓ ప్రణాళికతో ఆడాలని భావిస్తుంటాం. ఈ వికెట్‌పై 170-180 పరుగులు సరిపోతాయనుకుంటా. అయితే పవర్‌ప్లేలో మా బ్యాటింగ్, బౌలింగ్‌ ప్రదర్శన మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశించింది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఓ అదనపు బౌలర్‌ను జట్టులోకి తీసుకురావాలని భావించాం. కానీ పవర్‌ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోవడంతో మా ప్లాన్ మారిపోయింది. పొరపాట్లను సరిదిద్దుకొని, తర్వాతి మ్యాచ్‌ల్లో విజయం సాధించడానికి ప్రయత్నిస్తాం'' అని గిల్ అన్నాడు. సాయి సుదర్శన్ (6; 14 బంతుల్లో) స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన విజయ్ శంకర్ (10; 7 బంతుల్లో, 2x4) కూడా నిరాశపరిచాడు.

Story first published: Sunday, May 5, 2024, 11:33 [IST]
Other articles published on May 5, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+