RCB vs GT: పాపం రషీద్ ఖాన్.. బెయిల్ కిందపడక బచాయించిన మ్యాక్స్‌‌వెల్!

IPL 2022: GT vs RCB; Krishnamachari Srikkanth's opinion on match | Expert View | Oneindia news

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్ ప్లే ఆఫ్స్ అవకాశాలను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) సజీవంగా ఉంచుకుంది. గుజరాత్ టైటాన్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్నందుకుంది. ప్లే ఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ కేజీఎఫ్(కోహ్లీ, గ్లేన్ మ్యాక్స్‌వెల్, ఫాఫ్ డుప్లెసిస్) చెలరేగారు.

అయితే ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ‌కి లక్ ఫేవర్ చేసింది. కింగ్ కోహ్లీ రెండు సార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పుకోగా.. మ్యాక్స్‌వెల్ క్లీన్ బౌల్డ్ అయినా బెయిల్స్ కిందపడకపోవడంతో బచాయించాడు. ప్రస్తుతం ఈ వికెట్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

అసలేం జరిగిందంటే..?

అసలేం జరిగిందంటే..?

ఆర్‌సీబీ ఇన్నింగ్స్ సందర్భంగా రషీద్ ఖాన్ వేసిన 15వ ఓవర్ మూడో బంతికి భారీ షాట్ ఆడే క్రమంలో ఫాఫ్ డుప్లెసిస్ క్యాచ్ ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన గ్లేన్ మ్యాక్స్‌వెల్ అదృష్టం కొద్ది గోల్డెన్ డక్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.

రషీద్ ఖాన్ విసిరిన గూగ్లీని అంచనా వేయడంలో విఫలమైన గ్లేన్ మాక్స్‌వెల్.. స్వీప్ షాట్ ఆడే ప్రయత్నంలో బంతిని మిస్సయ్యాడు. అది కాస్త నేరుగా వికెట్లను తాకింది. అయితే బెయిల్స్‌ ఎగిరినప్పటికి అవి కిందపడలేదు. రూల్స్ ప్రకారం బెయిల్స్‌ కింద పడితేనే బ్యాటర్ ఔట్‌ అయినట్లు. వరుసగా రెండో వికెట్‌ తీశానన్న ఆనందంలో ఉన్న రషీద్‌ అసలు విషయం తెలిసి తల పట్టుకున్నాడు.

మ్యాక్సీ ఔటయ్యుంటే..

కీపర్ మాథ్యూ వెడ్ తలపై చేతులు పెట్టుకుని కూర్చోగా.. బంతి కాస్త బౌండరీకి దూసుకెళ్లింది. ఈ అవకాశంతో చెలరేగిన మ్యాక్సీ.. తనదైన స్విచ్ హిట్, రివర్స్ స్వీప్‌లతో గుజరాత్ బౌలర్లను చెడుగుడు ఆడాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఔటైనా.. దినేశ్ కార్తీక్‌తో కలిసి విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఒకవేళ మాక్స్‌వెల్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగి ఉంటే? గుజరాత్ మళ్లీ మ్యాచ్‌‌పై పట్టు సాధించేది. ఆర్‌సీబీ ఒత్తిడికి లోనయ్యేది.

రూల్స్ మార్చాలంటూ..

రూల్స్ మార్చాలంటూ..

కాగా ఈ సీజన్‌లో ఇలా జరగడం ఇది రెండోసారి. ఇంతకముందు రాజస్థాన్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్‌లో చాహల్‌ బౌలింగ్‌లో డేవిడ్‌ వార్నర్‌ కూడా ఇలాగే తప్పించుకున్నాడు. బంతి వికెట్లను తాకినప్పటికి బెయిల్స్‌ కిందపడకపోవడంతో వార్నర్‌ బతికిపోయాడు. ఈ క్రమంలో నిబంధనలు మార్చాలని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

బంతి వికెట్లను తాకి బెయిల్స్‌ కిందపడినా.. పడకపోయినా ఔట్‌ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. కొన్నిసార్లు ఇవే మ్యాచ్‌ను మలుపుతిప్పుతున్నాయని, మ్యాక్స్‌వెల్‌ విషయంలో ఇదే జరిగిందని కామెంట్ చేస్తున్నారు. మ్యాక్సీ గోల్డెన్‌ డక్‌ నుంచి తప్పించుకొని మ్యాచ్‌ విన్నర్‌గా నిలిచాడని గుర్తు చేస్తున్నారు.

కింగ్ ఈజ్ బ్యాక్..

కింగ్ ఈజ్ బ్యాక్..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 168 పరుగులు చేసింది. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా (47 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 62 నాటౌట్‌), మిల్లర్‌ (25 బంతుల్లో 3 సిక్సర్లతో 34) రాణించారు. అనంతరం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 18.4 ఓవర్లలో 2 వికెట్లే కోల్పోయి 170 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీకి తోడుగా... డుప్లెసిస్‌ (38 బంతుల్లో5 ఫోర్లతో 44) రాణించాడు. బౌలింగ్‌లో కీలకమైన వికెట్, అద్భుతమైన క్యాచ్‌ పట్టిన మ్యాక్స్‌వెల్‌ (18 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40 నాటౌట్‌) మెరుపు బ్యాటింగ్‌తో జట్టు విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Friday, May 20, 2022, 11:31 [IST]
Other articles published on May 20, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X