Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCB vs DC: దంచికొట్టిన కేఎల్ రాహుల్.. వరుసగా నాలుగో విజయం

RCB vs DC: ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాటర్ కేఎల్ రాహుల్ అదరగొట్టాడు. కేఎల్ రాహుల్ 93 పరుగులతో అద్భుతంగా రాణించడంతో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకుని ఆర్సీబీని బ్యాటింగ్ కు ఆహ్వానించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. అనంతరం 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 4 వికెట్లు కోల్పోయి 17.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. నాలుగు మ్యాచ్ ల్లో వరుసగా గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.

దంచికొట్టిన కేఎల్ రాహుల్
ఢిల్లీ బ్యాటర్లు కేఎల్ రాహుల్(93*, 53 బంతుల్లో 7 ఫోర్లుస 6 సిక్సులు), స్టబ్స్(38*, 23 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్) అద్భుతంగా రాణించడంతో ఢిల్లీ సునాయాసంగా విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ 13 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్ ను గెలుచుకుంది. ఈ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు ఇది వరుసగా నాలుగో విజయం. ఆర్సీబీతో జరిగిన ఈ మ్యాచ్ లో లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ కు గొప్ప ఆరంభం లభించలేదుయ ఆర్సీబీ కేవలం 30 పరుగులకే ముగ్గురు ఢిల్లీ బ్యాటర్లను ఔట్ చేసింది. ఆ జట్టు కేవలం 58 పరుగుల స్కోరు వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. కానీ ఆ తర్వాత కేఎల్ రాహుల్, ట్రిస్టన్ స్టబ్ కలిసి ఆర్సీబీ చేతుల నుంచి విజయాన్ని లాక్కున్నాడు. బెంగళూరు బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు పడగొట్టగా.. యశ్ దయాల్, సుయాష్ శర్మ తలో వికెట్ తీశారు.

RCB vs DC KL Rahul Shines as Delhi Capitals Secure Fourth Consecutive Win

ఢిల్లీ తరపున కేఎల్ రాహుల్ వరుసగా రెండో అర్థ సెంచరీ

తొలి వికెట్లు కోల్పోయిన తర్వాత కేఎల్ రాహుల్ కాస్త నెమ్మదిగా ఆడాడు. కానీ ఆ తర్వాత కేఎల్ రాహుల్ తన వేగాన్ని పెంచి ఒంటి చేత్తో మ్యాచ్ ను ఢిల్లీకి అనుకూలంగా మార్చాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరపు కేఎల్ రాహుల్ 93 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. కేఎల్ రాహుల్ తన ఇన్నింగ్స్‌లో 53 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 6 సిక్సర్లు కొట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున కేఎల్ రాహుల్ చేసిన ఈ ఇన్నింగ్స్ ఆ జట్టుకు ఒక సెంచరీ కంటే తక్కువ కాదు. ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కూడా అద్భుతంగా రాణించడంతో ఢిల్లీ సులభంగా మ్యాచ్ గెలిచింది.

163 పరుగులు చేసిన ఆర్సీబీ
ఐపీఎల్ 2025 24 మ్యాచ్ టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ చాలా వేగంగా ఆరంభించింది. వారు కేవలం 4 ఓవర్లలో 60 పరుగులు చేశారు. మొదటి 4 ఓవర్లలో ఆర్సీబీ 62 పరుగులు చేసి ఒక వికెట్ మాత్రమే కోల్పోయింది. దురదృష్టవశాత్తు గొప్ప ఫామ్ లో ఉన్న ఫిల్ సాల్ట్ రనౌట్ అయ్యాడు. 17 బంతుల్లో 37 పరుగులు చేసిన తర్వాత నిష్క్రమించాల్సి వచ్చింది. అయినప్పటికీ సాల్ట్ తన పని తాను చేసి పెవిలియన్ కు చేరుకున్నాడు.ఆర్సీబీ ఓపెనర్లు ఫిల్ సాల్ట్(37), విరాట్ కోహ్లీ(22) దూకుడుగా ఆడారు. రజత్ పాటిదార్ 25, కృనాల్ పాండ్యా 18 పరుగులు చేశారు. చివర్లో టిమ్ డేవిడ్ 20 బంతుల్లో 37 పరుగులు చేశాడు. టిమ్ డేవిడ్ 2 ఫోర్లు, 4 సిక్సులతో మెరుపులు మెరిపించడంతో ఆర్సీబీకి ఓ గౌరవప్రదమైన స్కోరును సాధించగలిగింది. ఢిల్లీ బౌలర్లలో విప్రజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ముకేశ్ కుమార్, మోహిత్ శర్మ చెరో వికెట్ తీశారు.

Story first published: Thursday, April 10, 2025, 23:25 [IST]
Other articles published on Apr 10, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+