Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCB vs DC: చెల‌రేగిన కార్తీక్, మాక్స్‌వెల్‌, హాజిల్‌వుడ్.. ఢిల్లీపై బెంగ‌ళూరు విజ‌యం

rcb

ఢిల్లీ క్యాపిట‌ల్స్‌పై 16 ప‌రుగుల తేడాతో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు విజ‌యం సాధించింది. బ్యాటింగ్‌లో దినేష్ కార్తీక్ (66*), మాక్స్‌వెల్(55) హాఫ్ సెంచ‌రీల‌తో చెల‌రేగ‌డంతో బెంగ‌ళూరు 189 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది. ఇక బౌలింగ్‌లో జోష్ హెజిల్‌వుడ్ (3-28), మ‌హ్మ‌ద్ సిరాజ్‌(2-21) ఢిల్లీ క్యాపిట‌ల్స్ ప‌త‌నాన్ని శాసించారు. దీంతో డేవిడ్ వార్న‌ర్ హాఫ్ సెంచ‌రీతో పోరాడిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేక‌పోయింది. ఆ జ‌ట్టు 173 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మై ఓట‌మిపాలైంది.

వార్న‌ర్ హాఫ్ సెంచ‌రీ

190 ప‌రుగుల భారీ ల‌క్ష్య చేధ‌న‌తో బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు ఓపెన‌ర్లు డేవిడ్ వార్న‌ర్, పృథ్వీషా శుభారంభాన్ని అందించారు. 28 బంతుల్లోనే 50 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. ఈ క్రమంలో పృథ్వీషా(16)ను సిరాజ్ ఫెమిలియ‌న్ చేర్చాడు. ఆ త‌ర్వాత మిచెల్ మార్ష్‌తో క‌లిసి రెండో వికెట్‌కు డేవిడ్ వార్న‌ర్ 44 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పాడు. ఈ క్ర‌మంలో ఐపీఎల్‌లో 52వ హాఫ్ సెంచ‌రీని పూర్తి చేసుకున్నాడు. జ‌ట్టు స్కోర్ 94 పరుగుల వద్ద ఉండ‌గా హ‌స‌రంగ వేసిన 12వ ఓవ‌ర్లో వార్న‌ర్(38 బంతుల్లో 66 ర‌న్స్‌, 4 ఫోర్లు, 5 సిక్సులు) ఎల్బీడబ్ల్యూలో ఔటయ్యాడు.

పంత్ మెరుపులు

ఢిల్లీ స్కోర్ 112 ప‌రుగుల వ‌ద్ద ఉండ‌గా 14వ ఓవ‌ర్ చివ‌రి బంతికి మిచెల్ మార్ష్ (24 బంతుల్లో 14 ర‌న్స్‌) ర‌నౌట్ అయ్యాడు. ఆ వెంటనే హాజిల్‌వుడ్ వేసిన‌ 15వ ఓవ‌ర్ తొలి బంతికి రోవ్మాన్ పావెల్ డ‌కౌట్ అయ్యాడు. దీంతో ఢిల్లీ క్యాపిట‌ల్స్ నాల్గో వికెట్ కోల్పోయింది. అదే ఓవ‌ర్ చివ‌రి బంతికి లలిత్ యాద‌వ్‌(1)ను కూడా హెజిల్‌వుడ్ ఫెమిలియ‌న్ చేర్చ‌డంతో ఢిల్లీ క్యాపిట‌ల్స్ 112 ప‌రుగుల‌కు 5 వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో ఫోర్లు, సిక్సుల‌తో స్కోర్ బోర్డును కాస్త ప‌రుగులు పెట్టించిన రిష‌బ్ పంత్ ఢిల్లీకి విజ‌యంపై ఆశ‌లు రేపాడు. అయితే సిరాజ్ వేసిన 17వ ఓవ‌ర్లో రిష‌బ్ పంత్ కొట్టిన షాట్‌ను విరాట్ కోహ్లీకి అద్బుతంగా సింగిల్ హ్యాండ్‌తో క్యాచ్ ప‌ట్టుకున్నాడు. దీంతో 3 ఫోర్లు, 2 సిక్సుల‌తో 17 బంతుల్లోనే 34 ప‌రుగులు చేసిన రిష‌బ్ పంత్ ఔట‌య్యాడు. ఢిల్లీ 142 ప‌రుగుల వ‌ద్ద ఆరో వికెట్ కోల్పోయింది.

బెంగ‌ళూరు విజ‌యం

ఇక ఢిల్లీ విజ‌యానికి చివ‌రి 2 ఓవ‌ర్ల‌లో 34 ప‌రుగులు కావాల్సిన స‌మ‌యంలో హేజిల్‌వుడ్ వేసిన 19వ ఓవ‌ర్ తొలి బంతికే శార్దూల్ ఠాకూర్ (17) ఔట‌య్యాడు. చివ‌రి ఓవ‌ర్లో 27 ప‌రుగులు కావాల్సి ఉండ‌గా 10 ప‌రుగులే వ‌చ్చాయి. దీంతో ఢిల్లీ ఇన్నింగ్స్ 173-7 వ‌ద్ద ముగిసింది. ఇక‌ ఢిల్లీపై 16 ప‌రుగుల తేడాతో బెంగ‌ళూరు విజయం సాధించింది. కుల్దీప్ యాద‌వ్, అక్ష‌ర్ ప‌టేల్ ప‌దేసి ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. బెంగ‌ళూరు బౌల‌ర్ల‌లో జోష్ హేజిల్‌వుడ్ 3, సిరాజ్ 2, హ‌స‌రంగ ఒక వికెట్ తీశారు.

చెల‌రేగిన కార్తీక్, మాక్స్‌వెల్‌

అంత‌కుముందు టాస్ ఓడి మొద‌ట బ్యాటింగ్ చేసిన రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు 5 వికెట్ల న‌ష్టానికి 189 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది. గ్లెయిన్ మాక్స్‌వెల్, దినేష్ కార్తీక్ హాఫ్ సెంచ‌రీల‌తో చెల‌రేగారు. మాక్స్‌వెల్ 7 ఫోర్లు, 2 సిక్సుల‌తో 34 బంతుల్లో 55 ప‌రుగులు చేశాడు. దినేష్ కార్తీక్ 5 ఫోర్లు, 5 సిక్సుల‌తో 34 బంతుల్లో 66 ప‌రుగులు చేశాడు. షాబాజ్ అహ్మ‌ద్‌తో క‌లిసి దినేష్ కార్తీక్ 54 బంతుల్లోనే అజేయంగా 94 ప‌రుగుల భాగ‌స్వామ్యం నెల‌కొల్పాడు. షాబాజ్ అహ్మ‌ద్(21 బంతుల్లో 31 ర‌న్స్‌, 3 ఫోర్లు, ఒక సిక్సు) కూడా నాటౌట్‌గా నిలిచాడు. దీంతో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు 5 వికెట్ల న‌ష్టానికి 189 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది. మిగ‌తావారిలో కోహ్లీ 12, డుప్లిసెస్ 8, ప్ర‌భుదేశాయి 6 ప‌రుగులు చేశారు. ఢిల్లీ బౌల‌ర్ల‌లో కుల్దీప్ యాద‌వ్, అక్ష‌ర్ ప‌టేల్, శార్దూల్ ఠాకూర్, ఖ‌లీల్ అహ్మ‌ద్ త‌లో వికెట్ తీశారు.

స్కోర్లు

రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు: 189-5

ఢిల్లీ క్యాప‌ట‌ల్స్‌:173-7

Story first published: Sunday, April 17, 2022, 7:48 [IST]
Other articles published on Apr 17, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+