RCB vs DC: హాఫ్ సెంచరీలతో చెలరేగిన దినేష్ కార్తీక్, మాక్స్‌వెల్.. ఢిల్లీ ముందు భారీ లక్ష్యం

దినేష్ కార్తీక్(66*), గ్లెయిన్ మాక్స్‌వెల్(55) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో ఢిల్లీ క్యాపిటల్స్ ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 190 పరుగుల భారీ లక్ష్యాన్నిఉంచింది. ఒకానొక దశలో 92 పరుగులకే 5 వికెట్లు కోల్పోయినప్పటికీ దినేష్ కార్తీక్, షాబాజ్ అహ్మద్(31*) అజేయంగా 97 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఆర్సీబీకి 189 పరుగుల భారీ స్కోర్ అందించారు.
ఓపెనర్లు విఫలం
ఓపెనర్లు విఫలమవడంతో రాయల్ చాలెంజర్స్ 13 పరుగులకే రెండు వికెట్లు కోల్పెయింది. అనుజ్ రావత్‌ను శార్దూల్ ఠాకూర్ డకౌట్ చేయగా.. ఫాఫ్ డుప్లిసెస్(8)ను ఖలీల్ అహ్మద్ ఫెమిలియన్ పంపాడు. ఈ క్రమలో ఆర్సీబీని విరాట్ కోహ్లీ, గ్లెయిన్ మాక్స్‌వెల్ ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే జట్టు స్కోర్ 40 పరుగుల వద్ద ఉండగా విరాట్ కోహ్లీ(12)ని లలిత్ యాదవ్ రనౌట్ చేశాడు.
మాక్స్‌వెల్ హాఫ్ సెంచరీ
ఒక వైపు వికెట్లు పడుతున్నప్పటికీ గ్లెయిన్ మాక్స్‌వెల్ మాత్రం చెలరేగిపోయాడు. ఫోర్లు, సిక్సర్లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో జట్టు స్కోర్ 75 పరుగుల వద్ద ఉండగా అక్షర్ పటేల్ వేపిన 10వ ఓవర్లో సుయాష్ ప్రభుదేసాయి (6) ఔటయ్యాడు. దీంతో 75 పరుగులకు ఆర్సీబీ 4 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత గ్లెయిన్ మాక్స్‌వెల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్‌లో మాక్స్‌వెల్‌కు ఇది 13వ హాఫ్ సెంచరీ. అయితే కుల్దీప్ యాదవ్ వేసిన 12వ ఓవర్లో లలిత్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి మాక్స్‌వెల్( 34 బంతుల్లో 55 రన్స్, 7 ఫోర్లు, 2 సిక్సులు) ఔటయ్యాడు. దీంతో 92 పరుగులకే ఆర్సీబీ 5 వికెట్లు కోల్పోయింది.
హాఫ్ సెంచరీతో ఆదుకున్న డీకే
ఈ క్రమంలో షాబాజ్ అహ్మద్‌తో కలిసి వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును ఆదుకున్నాడు. వీరిద్దరు కలిసి ఫోర్లు, సిక్సులతో ఆర్సీబీ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో ముస్తిఫిజర్ రహ్మాన్ వేసిన 18వ ఓవర్లో 4 ఫోర్లు, 2 సిక్సులు బాదిన దినేష్ కార్తీక్ ఏకంగా 28 పరుగులు రాబట్టాడు. అలాగే ఐపీఎల్‌లో డీకే 20వ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇక కుల్దీప్ యాదవ్ వేసిన చివరి ఓవర్లో 17 పరుగులు వచ్చాయి. వీరిద్దరు ఆరో వికెట్‌కు అజేయంగా 52 బంతుల్లోనే 97 పరుగులు జోడించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సమయానికి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 5 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. 5 ఫోర్లు, 5 సిక్సులతో 34 బంతుల్లోనే 66 పరుగులు చేసిన దినేష్ కార్తీక్ నాటౌట్‌గా నిలిచాడు. 3 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 21 బంతుల్లో 32 పరుగులు చేసిన షాబాజ్ అహ్మద్ కూడా నాటౌట్‌గా నిలిచాడు. ఢిల్లీ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications