Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCB vs DC: టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిట‌ల్స్‌.. బెంగ‌ళూరులోకి హ‌ర్ష‌ల్ ప‌టేల్, ఢిల్లీలోకి మిచెల్ మార్ష్‌

RCB vs DC: Delhi Capitals Won the Toss and Elected to Bowl First

రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ కెప్టెన్ రిష‌బ్ పంత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఫాఫ్ డుప్లిసెస్ నేతృత్వంలోని రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు మొద‌ట బ్యాటింగ్ చేయ‌నుంది. ఇక ఈ మ్యాచ్‌లో రెండు జ‌ట్లు ఒక్కో మార్పుతో బ‌రిలోకి దిగుతున్నాయి.

''మేము ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాము. వికెట్ పొడిగా ఉంది. మేము దానిని ఉపయోగించుకోవాలనుకుంటున్నాము. ఈ మ్యాచ్‌లో ఒక మార్పుతో బ‌రిలోకి దిగుతున్నాం. సర్ఫరాజ్ ఖాన్ స్థానంలో మిచెల్ మార్ష్ ఈ మ్యాచ్‌లో ఆడుతున్నాడు. అత‌ను మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. నేను నాల్గో స్థానంలో ఆడుతాను. మేము 100 శాతం మ్యాచ్‌లో క‌ష్ట‌ప‌డ‌తాం.'' అని ఢిల్లీ క్యాపిట‌ల్స్ కెప్టెన్ రిష‌బ్ పంత్ చెప్పాడు.

''పిచ్ ఊహించిన దానికంటే కొంచెం భయంకరంగా కనిపిస్తోంది. మా గ‌త మ్యాచ్‌లో చెన్నైకి ఇద్దరు నాణ్యమైన బ్యాటర్లు ఉన్నారు. వారు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక ఈ మ్యాచ్‌లో ఒక మార్పుతో ఆడుతున్నాం. హర్షల్ పటేల్ తిరిగి జ‌ట్టులోకి వచ్చాడు. అనుభ‌వజ్ఞుడైన అత‌ను జ‌ట్టులోఉండ‌డం మంచి అంశం. దీంతో గ‌త మ్యాచ్ ఆడిన‌ ఆకాష్‌ దీప్ ఈ మ్యాచ్‌లో ఆడ‌డం లేదు.'' అని రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లిసెస్ తెలిపాడు.

తుది జ‌ట్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), అనుజ్ రావత్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్(వికెట్ కీప‌ర్), సుయాష్ ప్రభుదేశాయ్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, జోష్ హేజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్.

ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్(వికెట్ కీప‌ర్/ కెప్టెన్), రోవ్‌మన్ పావెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహమాన్, ఖలీల్ అహ్మద్.

హెడ్ టూ హెడ్ రికార్డులు
ఐపీఎల్‌లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఇప్ప‌టివ‌ర‌కు 26 మ్యాచ్‌ల్లో త‌ల‌ప‌డ్డాయి. ఇందులో అత్య‌ధికంగా బెంగ‌ళూరు 15 మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించింది. ఢిల్లీ 10 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఒక మ్యాచ్‌లో ఫ‌లితం తేల‌లేదు. ఇరు జ‌ట్లు త‌ల‌ప‌డిన‌ప్పుడు ఓ మ్యాచ్‌లో అత్య‌ధికంగా ఆర్సీబీ 215 ర‌న్స్ చేయ‌గా.. ఢిల్లీ 196 ర‌న్స్ చేసింది. ఇక అత్య‌ల్పంగా ఆర్సీబీ 137 ర‌న్స్‌, ఢిల్లీ 95 ప‌రుగులు చేసింది. కాగా రెండు జ‌ట్లు త‌ల‌ప‌డిన చివ‌రి 5 మ్యాచ్‌ల్లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ 4 గెలిచింది.

Story first published: Saturday, April 16, 2022, 19:21 [IST]
Other articles published on Apr 16, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+