For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

6 4 4 4nb 6 1 4.. ఒకే ఓవర్‌లో 30 పరుగులు

RCB vs DC: ఐపీఎల్ 20025లో 24వ మ్యాచ్‌లో ఆర్సీబీ ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. ఆర్సీబీ తన ఇన్నింగ్స్‌ను అద్భుతంగా ప్రారంభించింది. ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ ఫోర్లు, సిక్సర్లతో వేగంగా పరుగులు సాధించడం ప్రారంభించారు. ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన కెప్టెన్ అక్షర్ పటేల్ ఓవర్లో ఇద్దరు బ్యాటర్లు 16 పరుగులు చేశారు. దీని తర్వాత ఇన్నింగ్స్‌లో మూడో ఓవర్ వేయడానికి మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఆర్సీబీ బ్యాటర్లు రెచ్చిపోయారు.

దారుణంగా దెబ్బతిన్న మిచెల్ స్టార్క్
ఆర్సీబీ ఇన్నింగ్స్ లో మూడో ఓవర్ వేసిన మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో మొదటి బంతి నుంచే ఫిల్ సాల్ట్ ఎదురుదాడికి దిగాడు. ఈ ఓవర్ తొలి బంతికి ఫిల్ సాల్ట్ లాంగ్ ఆన్‌లో భారీ సిక్స్ కొట్టాడు. తర్వాతి బంతికి ఫోర్ కొట్టాడు. ఆ ఓవర్ మూడో బంతికి సాల్ట్ మరో ఫోర్ కొట్టాడు. స్టార్క్ వేసిన మొదటి మూడజు బంతుల్లో మూడు బౌండరీలు బాదాడు.

RCB vs DC A Stunning 30 Runs in One Over Salt s Explosive Performance

ఈ ఓవర్లోని నాలుగో బంతికి స్టార్క్ నోబాల్ వేశాడు. ఫిల్ సాల్ట్ ఈ బంతిని కూడా మిస్ కాలేదు. ఫిల్ సాల్ట్ స్టార్క్ బౌలింగ్ లో మరో ఫోర్ కొట్టాడు. ఆ తర్వాతి బంతికి సాల్ట్ ఫ్రీ హిట్ కొట్టాడు. సాల్ట్ కళ్లు మూసుకుని బ్యాట్ ఊపాడు. ఆ బంతి బ్యాట్ అంచుకు తగిలి నేరుగా కీపర్ తలమీదుగా వెళ్లి బౌండరీ దాటింది. తర్వాతి బంతికి సాల్ట్ లెగ్ బై ఆఫ్ లో సింగిలి తీసుకున్నాడు. ఆ తర్వాతి బంతికే విరాట్ కోహ్లీ లెగ్ బై ఆఫ్ లో ఫోర్ కొట్టాడు. ఈ విధంగా స్టార్క్ వేసిన ఈ ఓవర్ లో మొత్తం 30 పరుగులు వచ్చాయి.

కేవలం 4 ఓవర్లలోనే 60 దాటి స్కోరు
ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ చాలా వేగంగా ఆరంభించింది. వారు కేవలం 4 ఓవర్లలో 60 పరుగులు చేశారు. మొదటి 4 ఓవర్లలో ఆర్సీబీ 62 పరుగులు చేసి ఒక వికెట్ మాత్రమే కోల్పోయింది. దురదృష్టవశాత్తు గొప్ప ఫామ్ లో ఉన్న ఫిల్ సాల్ట్ రనౌట్ అయ్యాడు. 17 బంతుల్లో 37 పరుగులు చేసిన తర్వాత నిష్క్రమించాల్సి వచ్చింది. అయినప్పటికీ సాల్ట్ తన పని తాను చేసి పెవిలియన్ కు చేరుకున్నాడు.

Story first published: Thursday, April 10, 2025, 20:43 [IST]
Other articles published on Apr 10, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+