RCB vs DC: తడబడిన ఆర్సీబీ.. ఢిల్లీ ముంగిట స్వల్ప లక్ష్యం
RCB vs DC: ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ తడబడింది. ఐపీఎల్ 2025 24 మ్యాచ్ టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ చాలా వేగంగా ఆరంభించింది. వారు కేవలం 4 ఓవర్లలో 60 పరుగులు చేశారు. మొదటి 4 ఓవర్లలో ఆర్సీబీ 62 పరుగులు చేసి ఒక వికెట్ మాత్రమే కోల్పోయింది. దురదృష్టవశాత్తు గొప్ప ఫామ్ లో ఉన్న ఫిల్ సాల్ట్ రనౌట్ అయ్యాడు. 17 బంతుల్లో 37 పరుగులు చేసిన తర్వాత నిష్క్రమించాల్సి వచ్చింది. అయినప్పటికీ సాల్ట్ తన పని తాను చేసి పెవిలియన్ కు చేరుకున్నాడు.
ఆర్సీబీ ఓపెనర్లు ఫిల్ సాల్ట్(37), విరాట్ కోహ్లీ(22) దూకుడుగా ఆడారు. రజత్ పాటిదార్ 25, కృనాల్ పాండ్యా 18 పరుగులు చేశారు. చివర్లో టిమ్ డేవిడ్ 20 బంతుల్లో 37 పరుగులు చేశాడు. టిమ్ డేవిడ్ 2 ఫోర్లు, 4 సిక్సులతో మెరుపులు మెరిపించడంతో ఆర్సీబీకి ఓ గౌరవప్రదమైన స్కోరును సాధించగలిగింది. ఢిల్లీ బౌలర్లలో విప్రజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ముకేశ్ కుమార్, మోహిత్ శర్మ చెరో వికెట్ తీశారు.

- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications