Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCB vs CSK: మ్యాచ్ జరుగుతుందా? వాతావరణం ఎలా ఉందంటే?

ఐపీఎల్‌-2024లో హై వోల్టేజ్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. ప్లేఆఫ్స్ బెర్తును నిర్ణయించే ఈ పోరు కోసం క్రికెట్ అభిమానులంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇవాళ మ్యాచ్ సజావుగా సాగుతుందా లేదా అనే టెన్షన్ అందరిలోనూ మొదలైంది.

వరుణుడు మ్యాచ్‌కు అంతరాయం కలిగిస్తాడేమో అనే సందేహాలు పెరిగాయి. వాతావరణ శాఖ ఇప్పటికే ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. వారంతానికి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అయితే సూచనల ప్రకారం శుక్రవారం సాయంత్రం వర్షం పడాల్సి ఉంది. కానీ నిన్న ఎలాంటి జల్లులు పడలేదు. ఇరు జట్లు తమ ప్రాక్టీస్ కొనసాగించాయి.

RCB vs CSK Weather Update Sunny Morning Greets Bengaluru

మరో గుడ్ న్యూస్ ఏంటంటే.. నిన్నటి కంటే ఇవాళ ఉదయం వాతావరణం ప్రకాశవంతంగా, ఎండగా ఉంది. బెంగళూరు‌లో మ్యాచ్ సజావుగా సాగుతుందనేలా ప్రస్తుతం సంకేతాలు కనిపిస్తున్నాయి. కానీ ఇవాళ సాయంత్రం అసలు ముప్పు పొంచి ఉంది. వాతావరణ శాఖ ప్రకారం శనివారం సాయంత్రం 4-8 గంటల మధ్య వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. దీంతో మ్యాచ్ ఆలస్యమయ్యే ఛాన్స్ ఉంది.

చిన్నస్వామి స్టేడియంలో అత్యుత్తమ సబ్-ఎయిర్ డ్రైనేజ్, ఏరేషన్ సిస్టమ్ ఉన్నాయి. దీంతో వరుణడు కాస్త కరుణించినా అరగంటలో మైదానాన్ని చకచక మ్యాచ్‌కు సిద్ధం చేయొచ్చు. అంతేగాక రాత్రి 10.56 గంటల వరకు గ్రౌండ్ సిద్ధమైనా అయిదు ఓవర్ల పాటు మ్యాచ్‌ను నిర్వహిస్తారు. దీంతో మ్యాచ్ ఫలితాన్ని తేల్చవచ్చు.
ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే ఆర్సీబీ ఇంటికీ, సీఎస్కే ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది.

ఇక మ్యాచ్ సజావుగా సాగి, ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే.. సీఎస్కే నెట్ రన్ రేటును అధిగమించేలా ఘన విజయం సాధించాలి. కనీసం 18 పరుగుల తేడాతో గెలవాలి. ఒకవేళ ఛేదన అయితే 11 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని అందుకోవాలి.

Story first published: Saturday, May 18, 2024, 10:20 [IST]
Other articles published on May 18, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+