
ఆర్సీబీ వర్సెస్ సీఎస్‌కే
ఆ గురుశిష్యులే- టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ, ఇప్పటి కేప్టెన్ విరాట్ కోహ్లీ. వారిద్దరు సారథ్యాన్ని వహిస్తోన్న చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఈ సాయంత్రం 7:30 గంటలకు షార్జా క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ రెండు జట్లకూ లీగ్ దశలో ఇదే చివరి మ్యాచ్. రెండు జట్లూ సెమీ ఫైనల్‌లో ఎదురెదురు పడితే తప్ప మరోసారి ఢీ కొట్టడానికి అవకాశం దాదాపు లేదనే అనుకోవచ్చు.

ఇద్దరు కేప్టెన్ల చివరి మ్యాచ్..
మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ- ఇద్దరూ తమ తమ జట్లకు కేప్టెన్సీ వహిస్తోన్నారు. ఈ ఐపీఎల్ సీజన్ తరువాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కేప్టెన్‌గా విరాట్ కోహ్లీ తప్పుకోబోతోన్నాడు. ఈ విషయాన్ని అతను ఇప్పటికే ప్రకటించాడు కూడా. రాయల్ ఛాలెంజర్స్ కేప్టెన్‌గా ఇదే తన చివరి ఐపీఎల్ అంటూ చెప్పాడు. ఈ నేపథ్యంలో- ప్రపంచ క్రికెట్‌లో యోధులుగా గుర్తింపు పొందిన మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ.. చిట్ట చివరి సారిగా ఢీ కొట్టబోతోన్నారు.

ధోనీ కేప్టెన్‌గా ఉన్నా..
చెన్నై సూపర్ కింగ్స్ కేప్టెన్‌గా ధోనీ కొనసాగినా.. రాయల్ ఛాలెంజర్స్ మాత్రం కొత్త కేప్టెన్ సారథ్యంలో వచ్చే ఐపీఎల్ సీజన్లలో ఆడుతుంది. ఆ కొత్త కేప్టెన్ ఎవరనేది ఇంకా తేలలేదు. ఈ సీజన్ ముగిసిన తరువాత.. దాని మీద దృష్టి సారిస్తామని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ ఇదివరకే చెప్పుకొచ్చింది. విదేశీ ప్లేయర్‌కు కేప్టెన్‌గా పగ్గాలను అప్పగించే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికోసం కొన్ని పేర్లను ఫిల్టర్ చేసినట్లు తెలుస్తోంది.

రెండింటికీ కీలక మ్యాచ్..
ఈ సాయంత్రం షార్జా స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్, సూపర్ కింగ్స్‌కు కీలకంగా మారింది. ప్రత్యేకించి- కోహ్లీసేనకు. ఈ మ్యాచ్‌లో గెలిస్తే.. కాస్త బెటర్ పొజీషన్‌లో ఉంటుంది బెంగళూరు టీమ్. లేదంటే- తన స్థానాన్ని మరింత దిగజార్చుకునే ప్రమాదం ఉంది. ఇప్పటికే కోల్‌కత నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దారుణంగా ఓడిపోయంది. 92 పరుగులకే కుప్పకూలిపోయింది. అటు బౌలింగ్ ఏమైనా రాణించిందా అంటే అదీ లేదు. ఒక్క వికెట్‌ను మాత్రమే కోల్పోయి.. లక్ష్యాన్ని ఛేదించేశారు నైట్ రైడర్స్.

లోపించింది అదొక్కటే..
ఈ సాల కప్ నమ్దే అంటూ సీజన్‌ను ఘనంగా ఆరంభించినప్పటికీ- ఆ తరువాత చతికిలపడినట్టు కనిపిస్తోంది బెంగళూరు జట్టు. ఎనిమిది మ్యాచుల్లో మూడింట్లో ఓడింది. ఈ మూడో ఓటమి దారుణంగా మారింది. తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లో విఫలం కావడం, కేప్టెన్‌గా తప్పుకొంటానంటూ విరాట్ కోహ్లీ ప్రకటించడం వంటి పరిణామాలతో కొంత గందరగోళంలో పడినట్టే. దీని నుంచి బయటపడాలంటే ఓ గెలుపు తక్షణ అవసరం. ఈ పరిస్థితుల్లో ధోనీ సేను ఢీ కొట్టి.. గెలుపు సాధిస్తుందా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications












