CSK ఫ్యాన్‌ను ఆడుకున్న RCB అమ్మాయి.. ఇన్నాళ్ల కసి ఇదేనా?(వీడియో)
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఆర్సీబీ, సీఎస్కే మధ్య పోరు కేవలం మైదానంలోనే కాదు.. గ్యాలరీలో కూడా హోరాహోరీగా సాగింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ అద్భుత విజయం సాధించడంతో బెంగళూరు ఫ్యాన్స్ సంబరాలు ఆకాశాన్ని తాకాయి. ఈ క్రమంలో గ్యాలరీలో ఓ ఆర్సీబీ మహిళా అభిమాని చేసిన సందడి ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో సదరు యువతి తన జట్టు గెలిచిన ఆనందంలో పక్కనే ఉన్న చెన్నై అభిమాని వైపు తిరిగి బిగ్గరగా అరుస్తూ.. ఉత్సాహంతో ఊగిపోతూ సెలబ్రేట్ చేసుకోవడం కనిపించింది.
సీఎస్కే ఫ్యాన్ ముందే ఆర్సీబీ అమ్మాయి రచ్చ
సాధారణంగా ఐపీఎల్ మ్యాచ్‌ల్లో సీఎస్కేకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఏ స్టేడియంలో మ్యాచ్ జరిగినా పసుపు రంగు జెండాలే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఆదివారం సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో మాత్రం బెంగళూరు అభిమానులు స్టేడియాన్ని ఎరుపు రంగుతో నింపేశారు. ఆ అమ్మాయి అరుస్తున్న సమయంలో పక్కనే ఉన్న సీఎస్కే అభిమాని మాత్రం చాలా నిశ్శబ్ధంగా, కాస్త నిరాశగా కనిపించాడు. అతని హావభావాలు చూస్తుంటే.. "సరేలే.. ఇప్పుడు మీ టైమ్ నడుస్తోంది, మా టైమ్ కూడా వస్తుంది" అని మనసులో అనుకుంటున్నట్లుగా ఉందని నెటిజన్లు సరదాగా కామెంట్ చేస్తున్నారు.

ఆర్సీబీ ఫ్యాన్స్ ఇన్నాళ్ల కసి ఇదేనా?
ఈ వీడియో చూసిన క్రికెట్ అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. "ఆర్సీబీ ఫ్యాన్స్ ఎమోషన్ అంటే ఇలాగే ఉంటుంది" అని కొందరు అంటుంటే.. "గెలుపోటములు సహజం, కానీ ఆ అమ్మాయి ఎనర్జీ మాత్రం వేరే లెవల్" అని మరికొందరు కామెంట్లు చేస్తున్నాకు. వేదిక ఏదైనా సీఎస్కే డామినేషన్ ఉంటుందనే పేరుంది, కానీ నిన్నటి మ్యాచ్ ఫలితం మాత్రం ఆర్సీబీ ఫ్యాన్స్‌కు దశాబ్ద కాలపు గుర్తింపునిచ్చేంత కిక్కు ఇచ్చిందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ 'ఫ్యాన్ వార్' వీడియో ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications