మరో నాలుగు రోజుల్లో ఐపీఎల్-2024 సీజన్ లీగ్ దశ ముగుస్తుంది. ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు వెళ్లే మూడు జట్లు ఖరారయ్యాయి. కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తదుపరి దశకు చేరాయి. ఇక మిగిలిన ఒక బెర్తు కోసం చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
ఈ స్థానం కోసం చిన్నస్వామి స్టేడియంలో శనివారం ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో సీఎస్కే గెలిస్తే నెట్‌రన్‌రేటుతో సంబంధం లేకుండా ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. కానీ ఆర్సీబీది డిఫ్రెంట్ స్టోరీ. ఆ జట్టు తుదిపరి దశకు చేరుకోవాలంటే నెట్‌రన్‌రేటు చాలా కీలకం. సీఎస్కే తొలుత ఓ 200 పరుగులు చేసిందనకుంటే దాన్ని బెంగళూరు 11 బంతులు మిగిలుండగానే ఛేదించాలి.

ఒకవేళ ఆర్సీబీనే మొదట బ్యాటింగ్ చేస్తే కనీసం 18 పరుగుల తేడాతో విజయం సాధించాలి. అప్పుడే రాయల్ ఛాలెంజర్స్ ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే మాత్రం ఆర్సీబీకి టోర్నీ నుంచి నిష్క్రమించాల్సిందే. మరోవైపు సీఎస్కే ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఈ మ్యాచ్ ఫలితంతోనే ప్లేఆఫ్స్ రేసు ముగుస్తుంది.
ప్లేఆఫ్స్ రేసు, విరాట్ కోహ్లి-ఎంఎస్ ధోనీ మధ్య పోటీ కావడంతో ఆర్సీబీ వర్సెస్ సీఎస్కే మ్యాచ్‌పై ఆసక్తి అందరిలోనూ పెరిగింది. ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు చూడాలని క్రికెట్ అభిమానులందరూ వరుణ దేవుణ్ని ప్రార్థిస్తున్నారు. రేపు ఒక్క రోజు బెంగళూరు వర్షం పడకూడదని కోరుకుంటున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ధోనీ పాత ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.
పదేళ్ల క్రితం ధోనీ చేసిన ట్వీట్ ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. ''ఏ టీమ్ విజయం సాధిస్తుందనేది ముఖ్యం కాదు, మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడానికి నేను ఉన్నాను'' అని 2014లో ధోనీ ట్వీటాడు. రేపటి ఆర్సీబీ-సీఎస్కే వంటి ఆసక్తికర మ్యాచ్‌కు ఈ ట్వీట్ పక్కాగా సరిపోవడంతో అది నెట్టింటిని ఊపేస్తోంది. అంతేగాక ధోనీది ఇదే ఆఖరి సీజన్ అని జోరుగా ప్రచారం సాగుతున్న వేళ, ప్రజల్ని ఆస్వాదింపచేయడానికి ధోనీ మరోసారి అడుగుపెడుతున్నాని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.