Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనీకి ఏమైంది? బాధ? కోపమా? క్రీడాస్ఫూర్తి మరిచి అలా చేశాడా! (Video)

డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. కీలక మ్యాచ్‌లో
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో 27 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది. డుప్లెసిస్ (54; 39 బంతుల్లో, 3X4, 3X6) టాప్ స్కోరర్.

విరాట్ కోహ్లి (47; 29 బంతుల్లో, 3X4, 4X6), రజత్ పటిదార్ (41; 23 బంతుల్లో, 2X4, 4X6), కామెరూన్ గ్రీన్ (38*; 17 బంతుల్లో, 3X4, 3X6) సత్తాచాటారు. మిచెల్ శాంట్నర్ (1/23) పొదుపుగా బౌలింగ్ చేశాడు. అయితే ఆర్సీబీ 219 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించినప్పటికీ, ప్లేఆఫ్స్ చేరాలంటే చెన్నై 200 పరుగులే చేయాలి. కాగా, ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన ఛేదనలో సీఎస్కే 20 ఓవర్లకు ఏడు వికెట్లు కోల్పోయి 191 పరుగులకు పరిమితమైంది.

RCB vs CSK MS Dhoni Leaves Without Shaking Hands Video Sparks Questions

రచిన్ రవీంద్ర (61; 37 బంతుల్లో, 5X4, 3X6), రవీంద్ర జడేజా (42; 22 బంతుల్లో, 3X4, 3X6), అజింక్య రహానె (33; 22 బంతుల్లో, 3X4, 1X6), ఎంఎస్ ధోనీ (25; 13 బంతుల్లో, 3X4, 1X6) పోరాడారు.ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై కావాలంటే సీఎస్కేకు చివరి ఆరు బంతుల్లో 17 పరుగులు అవసరమయ్యాయి. యశ్ దయాల్ వేసిన తొలి బంతిని ధోనీ స్టేడియం బయటకు పంపించాడు. కానీ రెండో బంతికి భారీ షాట్‌కు యత్నించిన ధోనీ పెవిలియన్‌కు చేరాడు. చివరి నాలుగు బంతుల్లో చెన్నై ఒక్క పరుగే సాధించింది.

అయితే మ్యాచ్ ముగిసిన అనంతరం ఆర్సీబీ ఆటగాళ్లకు ధోనీ షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. బెంగళూరు ఆటగాళ్లు గెలుపు సంబరాలు చేస్తుండగా కాసేపు ఎదురుచూసిన ధోనీ, ఆ తర్వాత మైదానాన్ని వీడాడు. ధోనీ అనూహ్యంగా వెళ్లిపోతుండటంతో తమ జట్టు ఆటగాళ్లు కూడా ఆశ్చర్యంగా చూశారు. అయితే ఆర్సీబీ కోచింగ్ స్టాఫ్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చి ధోనీ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ధోనీ అలా అర్ధంతరంగా మైదానాన్ని వీడటంపై చర్చ సాగుతోంది. జట్టు గెలవలేదనే కోపంతో క్రీడాస్ఫూర్తి మరిచి ధోనీ వెళ్లిపోయాడని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఆఖరి వరకు క్రీజులో ఉండి జట్టును గెలిపించలేదని బాధతో ధోనీ ఉన్నాడని, కన్నీటిని ఆపుకోలేక వెళ్లిపోయాడని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. అంతేగాక ఆర్సీబీ ప్లేయర్లు అతిగా సంబరాలు చేసుకున్నారని, అది చూడలేక ధోనీ అసహనంతో డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లి ఉంటాడని అంటున్నారు. మొత్తంగా ధోనీ వెళ్లిపోవడానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు.

Story first published: Sunday, May 19, 2024, 14:00 [IST]
Other articles published on May 19, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+