Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CSK Vs RCB : ధోనీ టాస్ గెలిచాడు.. బౌలింగ్ ఎంచుకోవడానికి ధోనీ చెప్పిన కారణమిదే

RCB Vs CSK : CSK won the toss and elect bowl first, dhoni gave a reason to bowl first.

ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా నేడు కీలక మ్యాచ్ జరుగనుంది. ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్, ఫాఫ్ డుప్లెసిస్ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అమీతుమీ తేల్చుకోనున్నాయి. పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో 7:30గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. రెండు జట్లకూ ఈ మ్యాచ్ చాలా కీలకమైంది. పాయింట్ల పట్టికలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 6వ స్థానంలో ఉండగా.. చెన్నై సూపర్ కింగ్స్ 9వ స్థానంలో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో టాస్ కోసం ఇరు జట్ల కెప్టెన్లు గ్రౌండ్లోకి రాగా.. టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు.

టాస్ గెలిచిన అనంతరం ఎంఎస్ ధోనీ మాట్లాడుతూ.. మేం ముందు బౌలింగ్ చేస్తాం. ప్రస్తుతం టాస్ అనేది కీలకం కానప్పటికీ మంచు ప్రభావం సెకండ్ ఇన్నింగ్స్‌లో ఉండొచ్చని భావిస్తున్నా. అందుకే తొలుత బౌలింగ్‌తో బరిలోకి దిగుతాం. మా జట్టులో సాంట్నర్ స్థానంలో మోయిన్ ఆలీ తిరిగి జట్టులో చేరాడు. మేం మంచి పార్ట్‌నర్ షిప్స్ బిల్డ్ చేయగలిగితే కచ్చితంగా గేమ్ మా సైడ్ ఉంటుందని భావిస్తున్నాం. టాస్ ఓడిన ఫాఫ్ డుప్లెసిస్ మాట్లాడుతూ.. టాస్ గెలిస్తే ముందు బ్యాటింగ్ ఎంచుకోవాలనుకున్నా. ఇక మేం సేమ్ టీంతో బరిలోకి దిగుతాం అని పేర్కొన్నాడు.

తుది జట్లు :
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్(వికెట్ కీపర్), మహిపాల్ లోమ్రోర్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, మొయిన్ అలీ, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్, కెప్టెన్), రవీంద్ర జడేజా, డ్వైన్ ప్రిటోరియస్, సిమర్‌జీత్ సింగ్, ముఖేష్ చౌదరి, మహేశ్ తీక్షణ

Story first published: Wednesday, May 4, 2022, 19:32 [IST]
Other articles published on May 4, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+