Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCB vs CSK Weather Update: ఆర్సీబీకి గుడ్ & బ్యాడ్ న్యూస్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు డూ ఆర్ డై మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. సొంతమైదానంలో చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో శనివారం తలపడనుంది. ప్లేఆఫ్స్‌కు చేరాలంటే రేపటి పోరులో ఆర్సీబీ తప్పక విజయం సాధించాలి. తదుపరి దశకు చేరాలంటే సాధారణంగా గెలిస్తే లెక్క సరిపోదు, సీఎస్కే నెట్ రన్ రేటును అధిగమించేలా విజయ ఢంకా మోగించాలి.

కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి. ఇక మిగిలిన ఒక్క బెర్తు కోసం ఆర్సీబీ, సీఎస్కే పోటీపడుతున్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఇరు జట్లు 13 మ్యాచ్‌లు ఆడగా చెన్నై సూపర్ కింగ్స్ (14 పాయింట్లు, +0.528) నాలుగో స్థానంలో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (12 పాయింట్లు, +0.387) ఆరో స్థానంలో ఉన్నాయి.

RCB vs CSK Bengaluru Weather Update - Mixed Bag for RCB Fans

సీఎస్కే నెట్ రన్ రేటును అధిగమించాలంటే రేపటి పోరులో ఆర్సీబీ కనీసం 18 పరుగుల తేడాతో విజయం సాధించాలి. ఒకవేళ ఛేదన అయితే 11 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని అందుకోవాలి. ఈ తరహాలో నెగ్గడం కోసం ఆర్సీబీ జట్టు మానసికంగా, శారీకంగా సాధన చేస్తోంది. అయితే బెంగళూరు నగరంలో శనివారం వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

రేపు సాయంత్రం వర్షం పడే అవకాశాలు దాదాపు 84% ఉన్నాయి. మేఘూవృతమైన ప్రాంతంలో ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇది ఆర్సీబీ అభిమానులకు చేదు వార్తనే. ఎందుకంటే ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే, ఇరు జట్లకు చెరో పాయింట్లు లభిస్తుంది. అప్పుడు బెంగళూరు జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. మరోవైపు సీఎస్కే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది.

అయితే ఆర్సీబీ అభిమానులకు గుడ్ న్యూస్ ఏంటంటే.. చిన్నస్వామి స్టేడియంలో అత్యుత్తమ సబ్-ఎయిర్ డ్రైనేజ్, ఏరేషన్ సిస్టమ్ ఉన్నాయి. దీంతో వరుణడు కాస్త కరుణించినా మైదానాన్ని చకచక మ్యాచ్‌కు సిద్ధం చేయొచ్చు. అంతేగాక రాత్రి 11 గంటల వరకు గ్రౌండ్ సిద్ధమైనా అయిదు ఓవర్ల పాటు మ్యాచ్‌ను నిర్వహిస్తారు. దీంతో మ్యాచ్ ఫలితాన్ని తేల్చవచ్చు.

Story first published: Friday, May 17, 2024, 16:11 [IST]
Other articles published on May 17, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+