Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఈ విజయం అనుష్క శర్మకు బర్త్‌డే గిఫ్ట్: సంతోషంగా కోహ్లీ

RCB victory was a birthday gift for my wife Anushka Sharma: Virat Kohli

హైదరాబాద్: బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ పుట్టినరోజున(సోమవారం) నాడా ఆమె భర్త, టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ విలువైన బహుమతిని అందజేశాడు. పెళ్లి తర్వాత ఇది అనుష్క తొలి పుట్టినరోజు కావడంతో కోహ్లీ ప్రత్యేక కానుక ద్వారా తన ప్రేమను వ్యక్తం చేశారు.

ఐపీఎల్‌ టోర్నీలో భాగంగా మంగళవారం చిన్నస్వామి మైదానంలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు- ముంబై ఇండియన్స్‌ జట్ల తలపడ్డాయి. ఐపీఎల్‌ టైటిల్‌పై ఆశలు నిలుపుకోవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు విజయాన్ని సాధించింది.

అనుష్క శర్మకు బర్త్‌డే గిఫ్ట్‌

ఈ మ్యాచ్‌లో బెంగళూరు 14 పరుగులతో విజయం సాధించింది. ఇదే రోజు కోహ్లీ భార్య అనుష్క శర్మ పుట్టిన రోజు కావడం విశేషం. దీంతో ఈ మ్యాచ్ విజయాన్ని తన భార్య అనుష్క శర్మకు బర్త్‌డే గిఫ్ట్‌ అని తెలిపారు. దీనిపై అనుష్క ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఈ ప్రత్యేకమైన బర్త్‌డేను అత్యంత దయ కలిగిన, తెలివైన, ప్రియమైన, ధైర్యవంతుడైన వ్యక్తితో జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది' అంటూ కోహ్లీతో ఉన్న ఇమేజిని పోస్టు చేసింది.

ఈ విజయం తనకో చిన్న కానుక

ఈ విజయం తనకో చిన్న కానుక

మ్యాచ్‌ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ 'నా భార్య అనుష్క శర్మ ఇక్కడే ఉంది. ఈ రోజు ఆమె బర్త్‌ డే. ఈ విజయం తనకో చిన్న కానుక. ఈ విజయాన్ని గ్యాలరీ నుంచి చూసిన అనుష్క చాలా ఎంజాయ్‌ చేసిందనుకుంటున్నా. ఆమె ముందు రెండు పాయింట్లు గెలవడం ఎంతో ప్రత్యేకంగా ఉంది. ఇది తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌. టోర్నీ కీలక దశకు చేరుకుంది' అని అన్నాడు.

ఈ మ్యాచ్‌ విజయం మాకెంతో అవసరం

ఈ మ్యాచ్‌ విజయం మాకెంతో అవసరం

'ఈ మ్యాచ్‌ విజయం ద్వారా వచ్చే రెండు పాయింట్లు ఎంతో అవసరమని మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లకు చెప్పా. బౌలర్లతో మాట్లాడా. మీ ప్రణాళికలను పక్కాగా అమలు చేయాలని చెప్పా. సిరాజ్‌, కొలిన్‌, సౌథీ అద్భుతంగా రాణించారు. ఉమేశ్‌ యాదవ్‌, చాహల్‌ బాగా బౌలింగ్‌ చేశారు' అని తెలిపాడు.

ఈ సీజన్‌లో బెంగళూరుకి ఇది మూడో విజయం

ఈ సీజన్‌లో బెంగళూరుకి ఇది మూడో విజయం

తాజా విజయంతో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు పాయింట్ల పట్టికలో ఐదో స్థానాన్ని దక్కించుకుంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్‌లాడిన బెంగళూరుకు ఇది మూడో విజయం మాత్రమే. టోర్నీలో భాగంగా తన తదుపరి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌తో తలపడనుంది. పూణె వేదికగా మే 5న ఈ మ్యాచ్‌ జరగనుంది.

Story first published: Wednesday, May 2, 2018, 13:45 [IST]
Other articles published on May 2, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+