
ఐపీఎల్‌లో విపరీతంగా అభిమానులు ఉన్న జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకటి. సోషల్ మీడియాలో ఈ జట్టు చాలా యాక్టివ్‌గా కూడా ఉంటుంది. ఎప్పటికప్పుడు తమ ఆటగాళ్లకు సంబంధించిన విషయాలు పంచుకుంటూ అభిమానులతో ఎంగేజ్ అవుతూ ఉంటుంది. అందుకే ఈ జట్టుకు సంబంధించిన ట్విట్టర్ ఖాతాను 64 లక్షల మందికిపైగా ఫాలో అవుతున్నారు. ఇలాంటి ట్విట్టర్ ఖాతాను సడెన్‌గా కొందరు స్కామర్లు హ్యాక్ చేసేశారు.
ఇలా హ్యాక్ చేసిన వాళ్లు.. అకౌంట్ పేరును 'బోర్‌డ్ ఏప్ యాచ్ క్లబ్' అని మార్చేశారు. అక్కడితో ఆగకుండా తమలో సభ్యులు కావాలని అనుకుంటే.. ఓపెన్‌సీలో తమ కంపెనీకి చెందిన 'బోర్‌డ్ ఏప్' లేదా 'మ్యూటెంట్ ఏప్'ను కొనుగోలు చేయాలని సూచించారు.
ట్విట్టర్ బయో నిండా తమ కంపెనీకి చెందిన లింకులు పోస్టు చేశారు. అలాగే కొన్ని ట్వీట్లు కూడా చేశారు. ఇలా ఆర్సీబీ ట్విట్టర్ ఖాతా హ్యాక్ అవడం ఇదే తొలిసారి కాదు. 2021లో కూడా ఒకసారి ఈ ట్విట్టర ఖాతాను కొందరు హ్యాక్ చేశారు. తాజాగా జరిగిన ఈ హ్యాక్ ఎటాక్ నుంచి మళ్లీ ఆర్సీబీ తమ ఖాతాను సెక్యూర్ చేసుకుందా? లేదా? ఇంకా తెలియరాలేదు.
తమ అభిమాన క్రికెట్ జట్టు అకౌంట్ హ్యాక్ అవడమే కాకుండా.. హ్యాకర్లు తమ ఎన్ఎఫ్‌టీలను ప్రమోట్ చేసుకోవడం చూసిన అభిమానులు కూడా షాకయ్యారు. క్యాష్ రిచ్ లీగ్‌లోని టాప్ జట్లలో ఒకటైన ఆర్సీబీపై గతంలో కూడా హ్యాకర్లు ఇలాగే దాడి చేశారు. అప్పట్లో అభిమానులకు ఈ విషయం వెల్లడించిన ఆర్సీబీ.. తమ ఖాతా కాంప్రమైజ్ అయిందని, అయితే తిరిగి దాన్ని తాము స్వాధీనం చేసుకున్నామని వెంటనే అభిమానులకు తెలియజేసింది. అయితే ఈ సారి మాత్రం ఆర్సీబీ నుంచి ఎటువంటి క్లారిటీ రాలేదు. దీంతో అకౌంట్ ఇంకా ఆర్సీబీ స్వాధీనం చేసుకోలేదా? అని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.