ఈ సాలా కప్ నమ్దే.. బాలీవుడ్ బ్యూటీని గట్టిగా కౌగిలించుకున్న కోహ్లీ! (వీడియో)
ఆర్సీబీ క్వాలిఫయర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టుపై ఘన విజయం సాధించి ఐపీఎల్ 2026 ఫైనల్లోకి దూసుకెళ్లింది. ధర్మశాల వేదికగా జరిగిన గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో ఆర్సీబీ 92 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో ఆర్సీబీ వరుసగా రెండో సీజన్‌లోనూ ఐపీఎల్ ఫైనల్‌కు అర్హత సాధించి రికార్డు సృష్టించింది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత ఆర్‌సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బాలీవుడ్ హీరోయిన్, తన భార్య అనుష్క శర్మను స్టాండ్స్‌లోకి వెళ్లి కౌగిలించుకున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
స్టాండ్స్‌లోకి వెళ్లి హగ్ చేసుకున్న కోహ్లీ
ఈ కీలక మ్యాచ్‌లో ఆర్సీబీ జట్టుకు, విరాట్ కోహ్లీకి మద్దతుగా నిలిచేందుకు బాలీవుడ్ నటి, కోహ్లీ భార్య అనుష్క శర్మ కూడా ధర్మశాల స్టేడియానికి వచ్చింది. మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం ఖరారైన వెంటనే విరాట్ కోహ్లీ ధర్మశాల క్రికెట్ అసోసియేషన్ స్టేడియం స్టాండ్స్ వైపు వెళ్లాడు. అక్కడ మొదట ఆర్సీబీ జట్టు సభ్యులను కలిసిన కోహ్లీ, ఆ తర్వాత నేరుగా అనుష్క శర్మ వద్దకు చేరుకున్నాడు. ఎంతో ఆనందంతో ఆమెను గట్టిగా హగ్ చేసుకుని, కాసేపు ముచ్చటించాడు. ఈ అందమైన క్షణాలకు సంబంధించిన వీడియో నెట్టింట క్రికెట్ అభిమానులను అమితంగా ఆకట్టుకుంటోంది.

రజత్ పాటిదార్ విధ్వంసం.. ప్లేఆఫ్స్‌లోనే అత్యధిక స్కోరు
ధర్మశాలలోని హెచ్పీసీఏ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీకి ఓపెనర్ విరాట్ కోహ్లీ 25 బంతుల్లో 43 పరుగులతో వేగవంతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. పవర్‌ప్లే ముగిసేసరికే ఆర్సీబీ వికెట్ నష్టానికి 76 పరుగులు చేసింది. ఆ తర్వాత గుజరాత్ బౌలర్లు పుంజుకున్నప్పటికీ.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ కేవలం 33 బంతుల్లోనే 93 పరుగులతో అజేయంగా నిలిచి విధ్వంసం సృష్టించాడు. ఫలితంగా ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 254 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఐపీఎల్ చరిత్రలోనే ప్లేఆఫ్స్ మ్యాచ్‌లలో నమోదైన అత్యధిక స్కోరు ఇదే కావడం విశేషం.
కుప్పకూలిన గుజరాత్ బ్యాటర్లు
255 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఆరంభంలోనే గట్టి షాకులు తగిలాయి. పవర్‌ప్లేలోనే టాప్-3 బ్యాటర్లతో పాటు నిశాంత్ సింధు, జేసన్ హోల్డర్ వికెట్లను కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడింది. కేవలం 88 పరుగులకే 8 వికెట్లు కోల్పోవడంతో ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద ఓటమిని చవిచూసే ప్రమాదంలో పడింది. అయితే ఈ దశలో రాహుల్ తెవాటియా 43 బంతుల్లో 68 పరుగులు చేసి జట్టు స్కోరును 150 దాటించాడు. చివరకు గుజరాత్ జట్టు ఆలౌట్ అవ్వడంతో ఆర్సీబీ 92 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆర్సీబీ బౌలర్లలో జాకబ్ డఫీ 3 వికెట్లు పడగొట్టగా.. భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, కృనాల్ పాండ్యా తలో 2 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications