Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆర్సీబీ స్టార్ బౌలర్‌పై నిషేధం.. క్రికెట్ కెరీర్‌కు ముప్పు!

ఆర్సీబీ స్టార్ బౌలర్‌ యశ్ దయాల్‌ను ఇప్పుడు కష్టాలు చుట్టుముట్టాయి. ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ట్రోఫీ అందించడంలో కీలక పాత్ర పోషించిన యశ్ దయాల్ తన ఆటతో అందరినీ ఆకట్టుకున్నాడు. కానీ ఇప్పుడు యశ్ దయాల్ కెరీర్‌కు ముప్పు వాటిల్లే ప్రమాదం కనిపిస్తోంది. యశ్ దయాల్‌పై లైంగిక దాడి ఆరోపణలు రావడంతో ఒక కీలక లీగ్ నుంచి అతడిని నిషేధించారు. యశ్ దయాల్ తనపై వచ్చిన లైంగిక ఆరోపణల కారణంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాడు. ఈ ఆరోపణల నేపథ్యంలో అతడిని ఒక కీలక లీగ్ నుంచి నిషేధించారు. ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్(UPCA) అతడిని రాబోయే యూపీ టీ20 లీగ్ నుంచి నిషేధించింది. యశ్ దయాల్‌పై 17 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణలు రాగా.. యూపీసీఏ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో అతని క్రికెట్ కెరీర్ కు ప్రమాదం ఏర్పడింది.

ఈ నిర్ణయం వల్ల యూపీ టీ20 లీగ్‌లో గోరఖ్‌పూర్ లయన్స్ జట్టు యశ్ దయాల్‌ను రూ. 7 లక్షలకు కొనుగోలు చేసినప్పటికీ, ఈ సీజన్‌లో అతను ఆడలేడు. యశ్ దయాళ్‌పై జైపూర్‌లోని సాంగనేర్ సదర్ పోలీస్ స్టేషన్‌లో మైనర్‌ బాలికపై లైంగిక దాడి కేసు నమోదైంది. ఈ కేసులో రాజస్థాన్ హైకోర్టు నుంచి అతనికి ఎలాంటి ఉపశమనం లభించలేదు. ఇది మైనర్‌కు సంబంధించిన కేసు కాబట్టి, అతని అరెస్టుపై స్టే ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. ఈ కేసు తదుపరి విచారణ ఆగస్టు 22న జరగనుంది. కోర్టు నుండి ఉపశమనం లభించకపోవడంతో యశ్ అరెస్టుకు అవకాశాలు పెరిగాయి. వాస్తవానికి యశ్ దయాల్‌పై లైంగిక వేధింపులు రావడం ఇది రెండోసారి.

RCB Star Yash Dayal Suspended Amid Sexual Assault Allegations A Threat to His Cricket Career

యశ్ దయాల్ ప్రదర్శన, ఇతర కేసులు
గతంలో ఘజియాబాద్‌కు చెందిన ఒక మహిళను వివాహం చేసుకుంటానని నమ్మించి లైంగికంగా వేధించాడని ఆరోపణలు వచ్చాయి. ఆ కేసులో అలహాబాద్ హైకోర్టు యశ్ దయాల్ అరెస్టుపై స్టే విధించింది. కానీ ఇప్పుడు జైపూర్‌లో నమోదైన కొత్త కేసు యశ్ దయాల్ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది. ఇదిలా ఉండగా.. యశ్ దయాల్ ఇటీవల ఐపీఎల్ 2025ల ఆర్సీబీ తరఫున మంచి ప్రదర్శన చేసి 15 మ్యాచ్‌లలో 13 వికెట్లు పడగొట్టి జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే యశ్ దయాల్‌పై వచ్చిన ఈ తీవ్రమైన ఆరోపణల కారణంగా అతని భవిష్యత్తు ప్రస్తుతం అనిశ్చితిలో ఉంది.

Story first published: Monday, August 11, 2025, 13:03 [IST]
Other articles published on Aug 11, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+