Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇప్పుడు అనుకుని ఏం లాభం

లక్నో సూపర్ జెయింట్స్ ఎట్టకేలకు విజయం సాధించింది. గురువారం రాత్రి లక్నోలో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఆధిపత్యం చాటింది. ఈ ఉత్కంఠ పోరులో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ద్వారా 9 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 19 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేయగా, అనంతరం బెంగళూరు అదే 19 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 203 పరుగులకే పరిమితమైంది.

ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌ ఇది. లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో వర్షం పదే పదే అంతరాయం కలిగించినప్పటికీ రెండు జట్లు కూడా ఏ మాత్రం ఏకాగ్రతను కోల్పోలేదు. 19 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 3 వికెట్లకు 209 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (56 బంతుల్లో 9 ఫోర్లు, 9 సిక్స్‌లతో 111) సెంచరీతో చెలరేగగా.. నికోలస్ పూరన్ (23 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 38), రిషభ్ పంత్ (10 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32 నాటౌట్) దూకుడుగా ఆడారు.

RCB Star Power Falters Virat Kohli and Teem seen Disappointment In Dressing Room After Lose to LSG

ఆర్‌సీబీ బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్, కృనాల్ పాండ్యా, రసిక్ సలామ్ తలో వికెట్ తీశారు. డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం ఆర్‌సీబీ లక్ష్యాన్ని 19 ఓవర్లలో 213 పరుగులుగా నిర్ణయించారు. భారీ స్కోర్ ఛేదించే క్రమంలో ఆర్సీబీ ప్రారంభంలోనే వికెట్లు కోల్పోయింది. తొమ్మిది పరుగులకే ఓపెనర్లిద్దరూ అవుట్ అయ్యారు. విరాట్ కోహ్లీ డకౌట్ కావడం పరాజయానికి బాటలు వేసినట్టయింది. నిర్ణీత 19 ఓవర్లలో 6 వికెట్లకు 203 పరుగులే చేసి ఓటమిపాలైంది. రజత్ పటిదార్ (31 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లతో 61), దేవదత్ పడిక్కల్ (25 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 34), టీమ్ డేవిడ్ (17 బంతుల్లో4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 40) రాణించినా.. 213 పరుగులను అందుకోలేకపోయింది.

ఈ మ్యాచ్ ఓటమి ఫలితం.. ఆర్సీబీ డ్రెస్సింగ్ రూమ్ క్లియర్ గా కనిపించింది. తీవ్ర నిరాశ అలముకుంది. ఏ ఒక్కరి ముఖంలో కూడా సంతోషం అనేదే లేదు. ఈ మ్యాచ్ గెలిచివుంటే 14 పాయింట్లు, మెరుగైన నెట్ రన్ రేట్ తో టేబుల్ టాపర్ గా నిలిచేది ఆర్సీబీ. ఆ ఛాన్స్ ను కోల్పోయిందా జట్టు. ప్రస్తుతం 12 పాయింట్లతో మూడో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇంకో నాలుగు మ్యాచ్ లను ఆడాల్సి ఉంది ఆర్సీబీ. ఇందులో రెండింటిని గెలిస్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా నేరుగా ప్లేఆఫ్స్ కు చేరుకోగలదు. తన తదుపరి మ్యాచ్ ఆదివారం ముంబై ఇండియన్స్ తో ఆడనుంది.

Story first published: Friday, May 8, 2026, 13:29 [IST]
Other articles published on May 8, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+