Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సీమంతం ఫోటోలు షేర్ చేసిన మ్యాక్స్ వెల్ భార్య.. ఖుషీఖుషీగా మ్యాక్సీ మామ!

చాలా ప్రయత్నాల తర్వాత ఆసీస్ స్టార్ గ్లెన్ మ్యాక్స్ వెల్ దంపతులకు సంతానం కలుగుతోంది. ఈ ఏడాది మే నెలలో ఈ విషయాన్ని గ్లెన్ భార్య విని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. పలుమార్లు గర్భస్రావం జరిగిన తర్వాత తమకు సంతానం కలుగుతోందని ప్రకటించింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆమెకు సీమంతం జరిగింది. విని ఆస్ట్రేలియాలో ఉంటున్నప్పటికీ తమ తమిళ మూలాలను మర్చిపోలేదు.

అందుకే గ్లెన్ తో వివాహం కూడా రెండు సాంప్రదాయాల ప్రకారం చేసుకుంది. ముందుగా తమిళ సంప్రదాయంలో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అనంతరం క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలోనే తమిళ సంప్రదాయం ప్రకారం వినికి సీమంతం చేయించాడు గ్లెన్. దీనికి సంబంధించిన ఫోటోలను విని తన సోషల్ మీడియాలో పంచుకుంది.

RCB star Glenn Maxwell wife shares glimpse of Baby Shower

గతేడాది మార్చి నెలలో వీళ్లిద్దరూ పెల్లించేసుకున్నారు. తమ వ్యక్తిగత జీవితాల గురించి వీళ్లిద్దరూ ఎక్కువగా బయటకు చెప్పరు. అయితే ఈ ఏడాది మే నెలలో తను గర్భవతిని అని, పలుమార్లు గర్భస్రావం జరిగిన తర్వాత ఇప్పుడు ఆరోగ్యమైన శిశువుకు జన్మనివ్వబితున్నట్లు ఆమె వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమెకు వలైపాక్కు కార్యక్రమం నిర్వహించారు. ఇది ఒక విధంగా తమిళ సీమంతం అన్నమాట.

ఈ కార్యక్రమంలో గర్భవతిని ఆమె బంధువులు కలిసి ఆశీర్వదిస్తారు. త్వరలో వీనికి డెలివరీ జరిగితే.. గ్లెన్ కూడా డాడీ క్రికెటర్ల క్లబ్బులో కలుస్తాడు. ఈ వేడుకలో గ్లెన్ మ్యాక్స్ వెల్ కూడా ఉత్సాహంగా పాల్గొన్నాడు. సోషల్ మీడియాలో ఫ్యాన్స్, సహచర ఆటగాళ్ళు ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఇక ప్రస్తుతం ఇంగ్లాండ్ లో యాషెస్ ఆడతున్న జట్టులో గ్లెన్ లేని సంగతి తెలిసిందే. చాలాకాలంగా అతను టెస్ట్ జట్టుకు దూరంగా ఉంటున్నాడు. గతేడాది ఫ్రెండ్ బర్త్ డే పార్టీలో గాయపడిన గ్లెన్..బా తర్వాత కోలుకొని మంచి ఫామ్ కనబరిచాడు. ఐపీఎల్ లో ఆర్సీబీ తరఫున అదరగొట్టాడు. వన్డే వరల్డ్ కప్ లో ఆసీస్ కు అతను చాలా కీలకం కానున్నాడు.

Story first published: Tuesday, July 25, 2023, 12:20 [IST]
Other articles published on Jul 25, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+