
మిక్స్డ్ ప్లేయర్లు..
విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహ్మద్ సిరాజ్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ విడుదల చేయలేదు. వారిని రిటైన్ చేసుకుంది. ఈ ముగ్గురూ కాకుండా.. కొత్తగా ఎనిమిది మంది ప్లేయర్లను తీసుకుంది. తొలి రోజు శ్రీలంకకు చెందిన టాప్ క్లాస్ స్పిన్నర్ వనిందు హసరంగ, హర్షల్ పటేల్‌ను కొనుగోలు చేసింది. వీరిద్దరూ ఇదివరకు రాయల్ ఛాలెంజర్స్‌తో అసోసియేట్ అయి ఉన్నారు. చెన్నై సూపర్ కింగ్స్‌లో సుదీర్ఘకాలం పాటు కొనసాగిన దక్షిణాఫ్రికా స్టార్ ఓపెనర్ ఫాప్ డుప్లెసిస్‌ను కొత్తగా టీమ్‌లో చోటు కల్పించింది.

డుఫ్లెసిస్, డీకే..
జట్టు కేప్టెన్సీ పగ్గాలను అతనికే అప్పగించడం దాదాపు ఖరారైనట్టే. విరాట్ కోహ్లీ తన సారథ్యా బాధ్యతల నుంచి తప్పుకొన్న నేపథ్యంలో- అనుభవజ్ఞుడికి జట్టు పగ్గాలను అప్పగించడంపై దృష్టి సారించింది. ఐపీఎల్, టీ20 మ్యాచ్‌లను ఆడిన అనుభవం ఉన్న వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్‌ను జట్టులోకి తీసుకుంది. అతను వైస్ కేప్టెన్‌గా అపాయింట్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. ఈ ఇద్దరి సారథ్యంలో ఈ సీజన్‌ను రాయల్ ఛాలెంజర్స్ కొత్తగా ఆరంభించడం దాదాపు ఖరారైనట్టే.

ఇంకా 14 మంది కోసం..
షాబాజ్ అహ్మద్, అనూజ్ రావత్, జోష్ హేజిల్‌వుడ్, అక్ష్‌దీప్‌లను తొలిరోజు వేలంపాట సందర్భంగా కొత్త జట్టులోకి తీసుకుంది. హేజిల్‌వుడ్ అనుభవజ్ఞుడైన పేస్ బౌలర్. ఇంకా 14 మందిని జట్టులోకి తీసుకోవాల్సి ఉండటం, పర్స్‌లో అమౌంట్ లిమిటెడ్‌గా ఉన్న నేపథ్యంలో- రాయల్ ఛాలెంజర్స్ ఫ్రాంఛైజీ ఎలాంటి ప్లేయర్లకు ప్రయారిటీ ఇస్తుందనేది ఆసక్తిగా మారింది. అన్‌క్యాప్డ్ క్రికెటర్ల వైపే మొగ్గు చూపక తప్పని పరిస్థితిని ఎదుర్కొనవచ్చు.

ప్లేయర్ల లిస్ట్
ప్రస్తుతం ఆర్సీబీ కోసం విరాట్ కోహ్లీ (రిటైన్డ్), ఫాప్ డుప్లెసిస్-రూ.7 కోట్లు, గ్లెన్ మ్యాక్స్‌వెల్ (రిటైన్డ్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్)-రూ.5.50 కోట్లు, షాబాజ్ అహ్మద్-రూ.2.4 కోట్లు, అనూజ్ రావత్-రూ.3.4 కోట్లు, వనిందు హసరంగ-10.75 కోట్లు, హర్షల్ పటేల్-రూ.10.75 కోట్లు, జోష్ హేజిల్‌వుడ్-రూ.7.75 కోట్లు, మహ్మద్ సిరాజ్ (రిటైన్డ్), అక్ష్‌దీప్-రూ.20 లక్షలు సెలెక్ట్ అయ్యారు. ఇంకా 14 మందిని ఆ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయాల్సి ఉంది. వీరిలో విదేశీ ప్లేయర్ల కోటా ఇంకా బాకీ ఉంది.


Click it and Unblock the Notifications












