
ఎంతమందంటే..
ఐపీఎల్ మెగా వేలానికి ముందే ముగ్గురు ఆటగాళ్లను రిటైన్ చేసుకున్న ఆర్సీబీ వేలంలో 19 మందిని కొనుగోలు చేసింది. దీంతో ప్రస్తుతం ఆ జట్టులో మొత్తం 22 మంది ఆటగాళ్లు ఉన్నారు. ఆశ్చర్యకరంగా శ్రీలంక స్పిన్నర్ వానిందు హసరంగను 10 కోట్ల 75 లక్షల రూపాయల భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసింది. అలాగే టీమిండియా యువ పేసర్ హర్షల్ పటేల్‌ను కూడా 10 కోట్ల 75 లక్షల రూపాయలకు దక్కించుకుంది. అలాగే ఆస్ట్రేలియా పేసర్ జోష్ హేజిల్ వుడ్‌ను రూ. 7.75 కోట్లకు, సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఫాఫ్ డుప్లిసెస్‌ను రూ.7 కోట్లకు, టీమిండియా వెటరన్ వికెట్ కీపర్‌ను దినేశ్ కార్తీక్‌ను రూ. 5.5 కోట్లకు కొనుగోలు చేసింది.

కెప్టెన్ ఎవరు?
వేలానికి ముందే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విరాట్ కోహ్లీ, గ్లెయిన్ మాక్స్‌వెల్, మహ్మద్ సిరాజ్‌ను రిటైన్ చేసుకుంది. అలాగే తాను ఈ సీజన్ నుంచి కెప్టెన్‌గా ఉండనని విరాట్ కోహ్లీ ప్రకటించాడు. దీంతో ఈ సీజన్‌ను నుంచి ఆర్సీబీకి కొత్త కెప్టెన్ రానున్నాడు. ఆ జట్టు ఇందుకోసం వేలంలో కెప్టెన్‌ను కొనుగోలు చేస్తుందని అంతా భావించారు. కానీ అలాంటిదేమి జరగలేదు. దీంతో ప్రస్తుతం జట్టులో ఉన్న ఫాఫ్ డుప్లిసెస్, గ్లెయిన్ మాక్స్‌వెల్‌లో ఒకరికి కెప్టెన్సీ ఇవ్వొచ్చనే చర్చ నడుస్తుంది. దినేష్ కార్తీక్ కూడా గతంలో కెప్టెన్సీ చేశాడు. అయితే మరికొందరు మాత్రం విరాట్ కోహ్లీ మళ్లీ కెప్టెన్సీ చేపట్టాలని కోరుతున్నారు.
బ్యాటర్లు, బౌలర్ల లిస్ట్
మెగా వేలంలో ఆర్సీబీ 8 మంది విదేశీ ప్లేయర్లు, 14 మంది స్వదేశీ ప్లేయర్లను కొనుగోలు చేసింది. వేలం ముగిశాక ఆర్సీబీ వద్ద ఇంకా కోటి 55 లక్షల రూపాయలు మిగిలి ఉన్నాయి. ఆ జట్టు బ్యాటర్లుగా విరాట్ కోహ్లీ, డుప్లెసిస్, దినేశ్ కార్తీక్, అనూజ్ రావత్, ఫిన్ అలన్, సిసోడియాను కొనుగోలు చేసింది. బౌలర్లుగా ఆకాశ్‌దీప్, సిరాజ్, హాజెల్‌వుడ్, విల్లే, బెహ్రెన్ డార్ఫ్, మిలింద్, కర్ణ్‌శర్మ, కౌల్‌ను దక్కించుకుంది. ఆల్‌రౌండర్లు మ్యాక్స్‌వెల్, హర్షల్, హసరంగ, షాబాజ్ అహ్మద్, లొమ్రోర్, రూథర్‌ఫోర్డ్, సుయాష్, అనీశ్వర్‌ను ఆర్సీబీ కొనుగోలు చేసింది. మొత్తంగా ఈ సారి బెంగళూరు జట్టు సమతూకంగా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఆర్సీబీ పూర్తి జట్టు ఇదే
విరాట్ కోహ్లీ(15 కోట్లు), మ్యాక్స్‌వెల్‌తో(11 కోట్లు), మహమ్మద్ సిరాజ్(7 కోట్లు), వానిందు హసరంగ (10.75 కోట్లు), హర్షల్ పటేల్(10.75 కోట్లు), డుప్లెసిస్ ( 7 కోట్లు), దినేశ్ కార్తీక్(5.5 కోట్లు), జోష్ హేజిల్ వుడ్ (7.75 కోట్లు), షాబాజ్ అహ్మద్(2.4 కోట్లు), అనుజ్ రావత్(3.4 కోట్లు), డేవిడ్ విల్లే ( 2 కోట్లు), షెర్ఫానే రూథర్‌ఫోర్డ్ (కోటి) మహిపాల్ లామ్రోర్(95 లక్షలు), ఫిన్ అలెన్ ( 80 లక్షలు), జేసన్ బెహ్‌రెండోర్ఫ్ ( 75 లక్షలు), సిద్ధార్థ్ కౌల్(75 లక్షలు), కర్ణ్ శర్మ(50 లక్షలు), చామ మిలింద్(25 లక్షలు), సుయాశ్ ప్రభుదేశాయ్(30 లక్షలు), ఆకాశ్ దీప్, అనీశ్వర్ గౌతమ్, లువ్‌నిత్ సిసోడియా(వీరందరికీ 20 లక్షలు).


Click it and Unblock the Notifications
