స్టార్ హీరో ప్రభాస్‌కు ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చింది. ఆర్సీబీ జెర్సీని ప్రభాస్‌కు అందించి తమకు ఉన్న అభిమానాన్ని పంచుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటో నెట్టింటిని షేక్ చేస్తోంది. వచ్చే సీజన్‌లో ప్రభాస్ ఆర్సీబీకి సపోర్ట్ చేయలని, ఆర్సీబీ జెర్సీ వేసుకొని ఫొటో షేర్ చేయాలని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రభాస్‌కు గిఫ్ట్ ఇవ్వడం బాగుందని ఆర్సీబీని మరికొందరు కొనియాడుతున్నారు.
ప్రభాస్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్' ఇటీవల విడుదల అయిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు విశేషాదరణ అభించింది. ప్రభాస్‌కి జోడీగా శ్రుతిహాసన్, విలన్‌గా పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ మూవీలో నటించారు.

అయితే అంతకుముందు ఈ సినిమా ట్రైలర్ విడుదలకు సలార్ మేకర్స్ డిఫ్రెంట్‌గా ప్రమోషన్స్ చేశారు. ఆర్సీబీతో ప్రమోషన్ స్టార్ చేశారు. విరాట్ కోహ్లి తన జెర్సీ నంబర్‌ను చూపిస్తున్న ఫొటోను ఉపయోగించి.. మరో 18 రోజుల్లో సలార్ ట్రైలర్ రిలీజ్ కానుందని ఆర్సీబీ తన ట్విటర్‌లో పోస్ట్ పెట్టింది. ఈ పోస్టర్‌లో కోహ్లి, ప్రభాస్‌తో పాటు హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మాక్స్‌వెల్ కూడా ఉన్నారు. కేజీఎఫ్-2 రిలీజ్ టైమ్‌లోనూ ఆర్సీబీతో సినిమా యూనిట్ ప్రమోషన్స్ చేయించుకున్న సంగతి తెలిసిందే.
ఇక ఆర్సీబీ విషయానికొస్తే.. ఐపీఎల్ తొలి సీజన్ నుంచి బెంగళూరు జట్టు ప్రతిసారి ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుంది. కానీ టైటిల్‌ను అందుకోలేకపోతుంది. 2024లో జరిగే 17వ సీజన్‌లో అయినా కప్‌ను ముద్దాడాలని పక్కాగా ప్రణాళిక రచిస్తోంది. దానికి తగ్గట్టుగానే ఇటీవల మినీ వేలంలో ఆటగాళ్లకు రూ.కోట్లు కుమ్మరించింది.
ఆర్‌సీబీ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు:
ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), గ్లేన్ మాక్స్‌వెల్, విరాట్ కోహ్లి, కామెరూన్ గ్రీన్ (ట్రేడెడ్), రజత్ పటిదార్, అనుజ్ రావత్, దినేశ్ కార్తీక్, సుయాష్ ప్రభుదేశాయ్, విల్ జాక్స్, మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భాండాగే, మయాంక్ దగర్ (ట్రేడెడ్), ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్, రీస్ టాప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, విజయ్ కుమార్ వైషాక్
వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు:
అల్జారి జోసెఫ్ (రూ. 11.50 కోట్లు), యశ్ దయాల్ (రూ. 5 కోట్లు), ఫెర్గూసన్ (రూ. 2 కోట్లు), టామ్ కరన్ (రూ. 1.50 కోట్లు), సౌరభ్ చౌహాన్ (రూ. 20 లక్షలు), స్వప్నిల్ సింగ్ (రూ. 20 లక్షలు)