వచ్చే ఐపీఎల్ సీజన్‌కు ఆర్సీబీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) షాకింగ్ డెసిషన్ తీసుకుంది. ఐపీఎల్ మొదలై 16 సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు ఆర్సీబీ ఒక్కసారి కూడా ట్రోఫీ నెగ్గలేదు. స్టార్లతో కూడిన బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ ఉన్నా కూడా ఆర్సీబీ ట్రోఫీ నెగ్గకపోవడం గమనార్హం. ఈ ఏడాది ఫేవరెట్లలో ఒకటిగా బరిలో దిగిన ఈ టీం.. ప్లేఆఫ్స్ కూడా చేరలేదు.
ఈ క్రమంలోనే ఆర్సీబీ యాజమాన్యం కీలక నిర్నయం తీసుకుంది. టీం డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్ మైక్ హెసాన్, హెడ్ కోచ్ సంజయ్ బంగర్ ఇద్దర్నీ తొలగించేయాలని డిసైడ్ అయిందట. గత ఐదేళ్లుగా ఈ ఫ్రాంచైజీ కోచింగ్ యూనిట్‌కు వీళ్లిద్దరూ మూలస్తంభాలుగా ఉన్నారు. ఈ ఇద్దరి మార్గనిర్దేశకత్వంలో ఆర్సీబీ మూడుసార్లు ఐపీఎల్ ప్లేఆఫ్స్ చేరింది. కానీ ట్రోఫీ మాత్రం ముద్దాడలేకపోయింది.

ఈ ఏడాది ఫేవరెట్లలో ఒకటిగా బరిలో దిగిన ఆర్సీబీ.. లీగ్ దశ చివరి రోజున గుజరాత్ చేతిలో ఓటమితో ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. ఈ నేపథ్యంలోనే కోచింగ్ స్టాఫ్‌పై ఆర్సీబీ యాజమాన్యం వేటు వేస్తోందట. బంగర్ అంతకుముందు పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ వంటి జట్ల కోచింగ్ బృందంలో కీలక పాత్ర పోషించాడు. భారత జట్టుకు కూడా బ్యాటింగ్ కోచ్‌గా సేవలందించాడు.
ఈ క్రమంలోనే అతన్ని 2021 ఐపీఎల్ సీజన్‌కు ముందు కన్సల్టెంట్‌గా తీసుకున్న ఆర్సీబీ.. మరుసటి ఏడాది అతన్ని హెడ్ కోచ్ చేసింది. ఇక న్యూజిల్యాండ్ మాజీ హెడ్ కోచ్ మైక్ హెసాన్‌ను 2019లో డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్‌గా నియమించింది. అంతకుముందు వరకు పంజాబ్ ఫ్రాంచైజీకి హెడ్‌కోచ్‌గా హెసాన్ సేవలందించాడు. వీళ్లిద్దరూ తమ టర్మ్‌లలో కూడా విరాట్ కోహ్లీతో కలిసి పని చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్త కోచింగ్ యూనిట్ కోసం వెతుకుతున్నట్లు ఆర్సీబీ మేనేజ్‌మెంట్ చెప్తోంది.