Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ పదో సీజన్‌లో తొలి హ్యాట్రిక్: అరుదైన ఘనత సాధించి బద్రీ

హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్‌లో తొలి హ్యాట్రిక్ నమోదైంది. బెంగళూరులోని చిన్నసామి స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్ శామ్యూల్స్ బద్రీ హ్యాట్రిక్ వికెట్లు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించాడు.

శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో బద్రీ ఈ ఘనతను సాధించాడు. మూడో ఓవర్ రెండో బంతికి పార్థీవ్ పటేల్(3) అవుట్ చేసిన బద్రీ.. ఆ తర్వాత బంతికి మెక్లీన్ గన్‌ను డకౌట్ చేశాడు. ఆ మరుసటి బంతికి ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మను డకౌట్‌గా పంపిన బద్రీ హ్యాట్రిక్ సాధించాడు.

RCB's Samuel Badree takes hat-trick Vs MI in IPL 10

దీంతో ముంబై ఇండియన్స్ ఎనిమిది పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 143 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఆదిలోనే వరుసగా వికెట్లను చేజార్చుకుంది.

బద్రీ 3వ ఓవర్‌లో హ్యాట్రిక్ సాధించాడిలా:

2.2వ బంతి - బద్రీ బౌలింగ్‌లో పార్థీవ్ పటేల్(3) షాట్ బాదగా గేల్‌ క్యాచ్ అందుకున్నాడు.
2.3వ బంతి - బద్రీ బౌలింగ్‌లో మెక్లెంగన్(0) భారీ షాట్‌కు ప్రయత్నించగా మన్దీప్ సింగ్ క్యాచ్ అందుకున్నాడు.
2.4వ బంతి - బ్రదీ బౌలింగ్‌లో రోహిత్ శర్మ(0) బౌల్డయ్యాడు.

RCB's Samuel Badree takes hat-trick Vs MI in IPL 10


దీంతో ముంబై ఇండియన్స్ 2.4 ఓవర్లకు గాను 4 వికెట్లు కోల్పోయి ఏడు పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది.
Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+