బెంగళూరు: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆటగాడు క్రిస్ గేల్ అరుదైన రికార్డ్ సృష్టించాడు. బెంగళూరు తరఫున ఆడుతున్న వెస్టిండీస్ సూపర్ స్టార్ బ్యాట్స్‌మన్ క్రిగేల్ ఐపీఎల్‌లో 200 సిక్సర్లు పూర్తి చేశాడు. ఈ మైలురాయిని చేరిన తొలి బ్యాట్స్‌మన్‌గా రికార్డు నెలకొల్పాడు.
సోమవారం నాటి మ్యాచ్‌కు ముందు 199 సిక్సులతో ఉన్న గేల్... సన్ రైజర్స్ హైదరాబాదుతో జరిగిన మ్యాచ్‌లో బౌల్ట్ వేసిన తొలి ఓవర్ మూడో బంతికి సిక్సర్ కొట్టాడు. దీంతో అతను సిక్సర్ల డబుల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్ రెండో సీజన్ నుండి గేల్ ఆడుతున్నాడు.
అతను 70 మ్యాచుల్లో (69 ఇన్నింగ్స్) ఈ ఘనత సాధించాడు. గేల్ ఇంకో పది సిక్సర్లు కొడితే మ్యాచ్‌కు సగటున మూడు సిక్సర్లు బాదినట్లు అయి ఉండేది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లలో రెండో స్థానంలో సురేష్ రైనా ఉన్నాడు.

క్రిస్ గేల్ 200 (70 మ్యాచుల్లో) - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
సురేష్ రైనా 134 (117 మ్యాచుల్లో) - చెన్నై సూపర్ కింగ్స్
రోహిత్ శర్మ 130 (114 మ్యాచుల్లో) - ముంబై ఇండియన్స్
యూసుఫ్ పఠాన్ 116 (108 మ్యాచుల్లో) - కోల్‌కతా నైట్ రైడర్స్
ఎమ్మెస్ ధోనీ 115 (114 మ్యాచుల్లో) - చెన్నై సూపర్ కింగ్స్