Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రసెల్‌కు భయపడి ఆ బౌలర్‌పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!

ఐపీఎల్ 17వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో సమరానికి సిద్ధమైంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా శుక్రవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమిపాలైన బెంగళూరు సొంత మైదానంలో పంజాబ్‌ కింగ్స్‌ను ఓడించి ఉత్సాహంతో ఉంది. అదే జోరులో కేకేఆర్‌ను ఓడించాలని కసిగా బరిలోకి దిగుతోంది.

అయితే భీకర బ్యాటింగ్ లైనప్ ఉన్న కోల్‌కతాను కట్టడిచేయడానికి ఆర్సీబీ ప్రత్యేక ప్రణాళికలు రచిస్తోంది. తుది జట్టు కూర్పు గురించి ప్రత్యేక దృష్టి పెట్టింది. కేకేఆర్‌లో రసెల్, రింకూ సింగ్ వంటి భారీ హిట్టర్లు ఉన్నారు. బౌండరీలు దగ్గరగా ఉండే చిన్నస్వామి స్టేడియంలో వాళ్లు మరింత ప్రమాదకరం. మరోవైపు బెంగళూరు బౌలింగ్ లైనప్ ఆందోళన కలిగిస్తోంది.

RCB Playing XI disappoint to Alzarri Joseph this is the RCB final team to play against KKR

అల్జారీ జోసెఫ్ ఔట్
రూ.11.50 కోట్లు వెచ్చింది కొనుగోలు చేసిన అల్జారీ జోసెఫ్ నిరాశపరుస్తున్నాడు. పంజాబ్ మ్యాచ్‌లో పది ఎకానమీ రేటుతో పరుగులు సమర్పించుకున్నాడు. అంతేగాక జోసెఫ్ షార్ట్ బాల్స్‌‌నే ఎక్కువగా సంధిస్తున్నాడు. చిన్నస్వామిలో రసెల్ షార్ట్ బంతులను సులువుగా స్టాండ్స్‌కు తరలించగలడు. అందుకే కేకేఆర్‌తో జరిగే మ్యాచ్‌లో జోసెఫ్‌కు బదులుగా టోప్లే లేదా ఫెర్గూసన్‌ను జట్టులోకి తీసుకురావాలని ఆర్సీబీ యాజమాన్యం భావిస్తోంది. కానీ టోప్లే ఎడమచేతి వాటం బౌలర్. ఇప్పటికే లెఫ్టార్మ్ పేసర్ యశ్‌ దయాల్ జట్టులోనే ఉన్నాడు.

ఫెర్గూసన్ ఎంట్రీ
అంతేగాక ఎడమచేతి వాటం స్పిన్నర్ మయాంక్ దగార్ కూడా జట్టులో ఉన్నాడు. మరోవైపు కేకేఆర్ జట్టులో రింకూ సింగ్, వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రాణా, సునీల్ నరైన్ వంటి బ్యాటర్లు లెఫ్ట్ హ్యాండర్సే. దీంతో టోప్లేకు బదులుగా లాకీ ఫెర్గూసన్ జట్టులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పైగా ఈ ఏడాది ఫెర్గూసన్‌ టీ20ల్లో మంచి ఫామ్‌లో ఉన్నాడు. పాకిస్థాన్, ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌ల్లో ఈ న్యూజిలాండ్ పేసర్ మెరుగైన ప్రదర్శన చేశాడు. బ్యాటింగ్ లైనప్‌ను అలానే కొనసాగించాలని ఆర్సీబీ మేనేజ్మెంట్ భావిస్తోంది.

RCB Playing XI disappoint to Alzarri Joseph this is the RCB final team to play against KKR

ఆధిక్యం ఎవరిది?
ఐపీఎల్‌లో ఆర్సీబీ, కేకేఆర్ 32 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. బెంగళూరు 14, కోల్‌కతా 18 మ్యాచ్‌ల్లో గెలిచింది. కేకేఆర్‌పై ఆర్సీబీ అత్యధిక స్కోరు 213, అత్యల్ప స్కోరు 49. అలాగే బెంగళూరుపై కోల్‌కతా అత్యధిక స్కోరు 222, అత్యల్ప స్కోరు 84. గత సీజన్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఆర్సీబీపై కేకేఆర్‌దే పైచేయి. 2022లో ఆడిన ఒక్క మ్యాచ్‌లో బెంగళూరు గెలిచింది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుది జట్టు (అంచనా)
డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, కామెరూన్ గ్రీన్, రజత్ పటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, దినేశ్ కార్తీక్, అనుజ్ రావత్, లాకీ ఫెర్గూసన్, మయాంక్ దగార్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్.
ఇంపాక్ట్ ప్లేయర్: మహిపాల్ లోమ్రర్.

Story first published: Thursday, March 28, 2024, 15:54 [IST]
Other articles published on Mar 28, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+