For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RCB playing 11: డేవిడ్ విల్లీ ఔట్.. హర్షల్ పటేల్‌ ఇన్, లక్నోతో తలపడే ఆర్సీబీ జట్టు ఇదే!

RCB Playing 11 vs LSG: Harshal Patel In And David Willey Out Bangalore Team For Match 31 In IPL 2022

ఐపీఎల్-2022లో భాగంగా మంగళవారం (నేటి) రాత్రి 7.30గంటలకు ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ) వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మధ్య మ్యాచ్ జరగనుంది. ఇరు జట్లు సమ ఉజ్జీలయిన ప్లేయర్లతో పటిష్ఠంగా కన్పిస్తున్నాయి. దీంతో మరో రసవత్తర పోరు ఖాయంగా కన్పిస్తోంది.

ఇరు జట్లు చెరో 6మ్యాచ్‌లు ఆడగా.. చెరో 4మ్యాచ్‌లు గెలిచి 8పాయింట్లతో సరిసమానంగా ఉన్నాయి. కాకపోతే నెట్ రన్‌రేట్ విషయంలో ఆర్సీబీ (+0.142)తో పోల్చితే ఎల్ఎస్‌జీ(+0.296) కాస్త మెరుగ్గా ఉండడంతో పాయింట్ల పట్టికలో ఎల్ఎస్‌జీ మూడో స్థానంలో కొనసాగుతుండగా.. ఆర్సీబీ నాలుగో స్థానంలో కొనసాగుతుంది.

బ్యాట్ దుమ్ముదులిపిన రాహుల్.. సెంచరీతో ఫామ్ ఫుల్

బ్యాట్ దుమ్ముదులిపిన రాహుల్.. సెంచరీతో ఫామ్ ఫుల్

లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ముంబై ఇండియన్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగాడు. ఇప్పుడు టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రాహుల్ (235)పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. అలాగే లక్నో టీం బ్యాటర్లలో క్వింటన్ డికాక్, మనీష్ పాండే, దీపక్ హుడా, ఆయుష్ బదోని జట్టు గెలుపులో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు.

ఇకపోతే లక్నోకు ప్రధాన బలం ఆ జట్టు ఆల్ రౌండర్లే. జాసన్ హోల్డర్, కృనాల్ పాండ్యా, మార్కస్ స్టోయినిస్ లాంటి మేటి ఆల్‌రౌండర్లు ఏ స్థితిలోనైనా మ్యాచ్‌ను తమ వైపు తిప్పుకోగలిగేవారే. అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్ లాంటి దేశీయ ప్లేయర్లు మ్యాచ్ గమనాన్ని మార్చే సత్తా ఉన్నవారే.

దినేష్ కార్తీక్.. ఫినిషింగ్ ఫామ్ కిరాక్

దినేష్ కార్తీక్.. ఫినిషింగ్ ఫామ్ కిరాక్

గత మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు లోయర్ ఆర్డర్లో ఫినిషింగ్ బలంగా ఉంది. ఆ మ్యాచ్‌లో టాప్ ఆర్డర్ నిరాశపరిచినా.. సూపర్ ఫాంలో ఉన్న లోయర్ ఆర్డర్ బ్యాటర్ దినేష్ కార్తీక్ (66పరుగులు 34బంతుల్లో) తుఫాన్ ఇన్నింగ్స్ ఆడి జట్టును పటిష్ట స్థితికి తీసుకొచ్చి ఆర్సీబీ గెలిచేలా చేశాడు.

అలాగే అనుజ్ రావత్, షాబాజ్ అహ్మద్ లాంటి యంగ్ ప్లేయర్లు.. తమదైన రోజున చెలరేగి ఆడుతున్నారు. ఇక మ్యాక్స్‌వెల్, కెప్టెన్ డుప్లెసిస్, కోహ్లీ లాంటి దిగ్గజ ప్లేయర్లలో ఎవరు నిలదొక్కుకున్నా ప్రత్యర్థికి చెమటలు పట్టడం ఖాయం. హర్షల్ పటేల్, సిరాజ్, హాజిల్ వుడ్ లాంటి మార్క్ చూపించే పేసర్లు, పర్పుల్ క్యాప్ రేసులో ఉన్న హసరంగ‌తో కూడిన బౌలింగ్ యూనిట్ పటిష్టంగా కన్పిస్తుంది.

మ్యాచ్‌కు దూరం విల్లీ .. అందుబాటులోకి హర్షల్ మళ్లీ

మ్యాచ్‌కు దూరం విల్లీ .. అందుబాటులోకి హర్షల్ మళ్లీ

తన సోదరి చనిపోవడంతో ఇటీవల ఆమె అంత్యక్రియలకు వెళ్లొచ్చిన హర్షల్ పటేల్ గత ఢిల్లీ మ్యాచ్‌లో బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. నేటి మ్యాచ్‌లోనూ డేవిడ్ విల్లీని తప్పించి హర్షల్ పటేల్‌నే ఆడించనున్నారు. తుది జట్ల అంచనా విషయానికొస్తే..

లక్నో సూపర్ జెయింట్స్ ప్రాబబుల్ ప్లేయింగ్ XI: కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డికాక్, మనీష్ పాండే, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, ఆయుష్ బదోని, జాసన్ హోల్డర్, కృనాల్ పాండ్యా, దుష్మంత చమీర, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రాబబుల్ ప్లేయింగ్ XI: ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), అనుజ్ రావత్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్, సుయాశ్ ప్రభుదేశాయ్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, జోష్ హాజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్

Story first published: Tuesday, April 19, 2022, 11:28 [IST]
Other articles published on Apr 19, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+