RCB Playing 11 vs KKR:తెలుగోడు చెలరేగేనా..ఫామ్‌లోకి వచ్చిన మ్యాక్సీ!కేకేఆర్‌పై బరిలోకి దిగే ఆర్‌సీబీ జట్టిదే!

హైదరాబాద్: దుబాయ్ మైదానంలో ఆదివారం రాత్రి క్వాలిఫయర్-1లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం సాధించి ఐపీఎల్ 2021 ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇక ఈరోజు కఠినమైన మ్యాచ్ జరగనుంది. ఎలిమినేటర్‌లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తలపడనుంది. షార్జా క్రికెట్ మైదానంలో రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఎలిమినేటర్‌లో మ్యాచ్‌లో ఓడిన జట్టు ఇంటి ముఖం పట్టాల్సిందే. ఈ నేపథ్యంలో ఇరు జట్లు విజయం కోసం హోరాహోరీగా తలపడడం ఖాయం. ఈ మ్యాచులో గెలిచిన జట్టు క్వాలిఫయర్-1లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఇక ఆర్‌సీబీ తొలి ఐపీఎల్ టైటిల్ వేటలో ఉండగా.. కేకేఆర్ మూడో టైటిల్‌పై కన్నేసింది.

కెప్టెన్‌గా ఇదే చివరి సీజన్:
ఎలిమినేటర్‌లో గెలిచి టైటిల్ రేసులో నిలిచేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు సిద్ధమవుతున్నాయి. బలాబలాల్లో రెండు జట్లు సమానంగానే కనిపిస్తున్నాయి. అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్నాయి. దాంతో ఈ మ్యాచుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఐపీఎల్ 2021 లీగ్ దశలో ఆడిన మ్యాచ్‌ల్లో రెండు జట్లు చెరో విజయం సాధించాయి. 14 మ్యాచ్‌ల్లో 9 విజయాలతో 18 పాయింట్లు సాధించి మూడో స్థానంతో ఆర్‌సీబీ ముందంజ వేయగా.. ఏడింట్లో నెగ్గిన కేకేఆర్ 14 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టిన చివరి జట్టుగా నిలిచింది. కెప్టెన్‌గా ఇదే తన చివరి సీజన్ అని విరాట్ కోహ్లీ ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకే జట్టుకు తొలి ట్రోఫీ అందించేందుకు తహతహలాడుతున్నాడు.

తెలుగోడు చెలరేగేనా:
బెంగళూరు ఓపెనర్లు దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీలు పరుగులు చేస్తున్నారు. లీగ్ ఆసాంతం పరుగులు చేసిన ఈ ఇద్దరు.. లీగ్ చివరి మ్యాచులో మాత్రం విఫలమయ్యారు. ఢిల్లీ క్యాపిటల్స్‌పై కోహ్లీ 4 పరుగులు చేయగా.. పడిక్కల్ డకౌట్ అయ్యాడు. దాంతో కీలక ఎలిమినేటర్‌లో పడిక్కల్, విరాట్ చెలరేగాల్సిన అవసరం ఉంది. ఢిల్లీతో మ్యాచ్‌లో ఆఖరి బంతికి సిక్స్ కొట్టి బెంగళూరును గెలిపించిన తెలుగు ఆటగాడు కోన శ్రీకర్ భరత్ రాత్రికిరాత్రే హీరో అయిపోయాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన భరత్.. సమయానుసారంగా బ్యాట్ జులిపించాడు. 52 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో 78 పరుగులు చేశాడు. దాంతో ఎలిమినేటర్‌లో అతడిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఓపెనర్లతో పాటు భరత్ కూడా చెలరేగితే.. బెంగళూరుకు తిరుగుండదు.

పేస్ త్రయంతో సవాలే:
స్టార్ ఆటగాళ్లు ఏబీ డివిలియర్స్, గ్లెన్ మాక్స్‌వెల్ రెండో దశలో పూర్తిగా విఫలమయినా.. ఢిల్లీపై చెలరేగారు. ఏబీ కీలక ఇన్నింగ్స్ ఆడగా.. మ్యాక్సీ సూపర్ ఫిఫ్టీ చేశాడు. ఈ ఇద్దరు కూడా చెలరేగితే బెంగళూరు భారీ స్కోర్ చేసే అవకాశం ఉంది. తొలి దశలో ఈ ఇద్దరు బెంగళూరు విజయాల్లో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. షాబాజ్ అహ్మద్, డేనియల్ క్రిస్టియన్‌లతో ఆర్‌సీబీ బ్యాటింగ్ విభాగం పటిష్టంగా ఉంది. ఇక బౌలింగ్‌లో అత్యధిక వికెట్ల వీరుడిగా కొనసాగుతున్న హర్షల్ పటేల్ (30)తో పాటు మొహ్మద్ సిరాజ్, జార్జ్ గార్టన్‌ల పేస్ త్రయం ప్రత్యర్థికి సవాలు విసిరేదే. ఇక స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ బంతితో మాయ చేస్తున్నాడు. మొత్తానికి బెంగళూరు అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. అందరూ సమిష్టిగా రాణిస్తే.. విజయం పెద్ద కష్టమేమి కాదు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుది జట్టు (అంచనా):
దేవ్‌దత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ, కేఎస్ భరత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్, షాబాజ్ అహ్మద్, డేనియల్ క్రిస్టియన్, జార్జ్ గార్టన్, హర్షల్ పటేల్, మొహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చహల్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications