
ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో ఈరోజు మధ్యాహ్నం 3.30కు గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ జరగనుంది. ఆర్సీబీ ప్లేయర్లు తమ నిలకడ లేమితో విఫలమవుతున్న వేళ వారి బ్యాటింగ్ విభాగాన్ని తిరిగి పటిష్ఠం చేసుకోవాల్సిన అవసరముంది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ పేలవమైన ఫామ్ ఆందోళనకు గురిచేస్తుంది. కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ ఒకట్రెండు మ్యాచ్‌ల్లో చెలరేగినా.. తర్వాత నిరాశపర్చుతూనే ఉన్నాడు. గ్లెన్ మాక్స్‌వెల్ ఇప్పటివరకు తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. అతని అస్థిర ప్రదర్శన జట్టును బలహీనంగా చేస్తుంది. ఇక 9మ్యాచ్‌లలో 5 విజయాలతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో 5స్థానంలో ఉంది.
గుజరాత్ టైటాన్స్ విషయానికొస్తే.. ఇప్పటివరకు ఎనిమిది గేమ్‌లలో కేవలం ఒకే మ్యాచ్‌లో ఓడి ఏడు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ ప్రతి విజయంలో మ్యాచ్ విన్నర్లు వెలుగుచూస్తున్నారు. బౌలింగ్లో అల్జారీ జోసేఫ్, షమీ రాణిస్తుండడం వారికి కలిసొస్తుండగా.. రషీద్ ఖాన్ బౌలింగ్లో విఫలమైతే బ్యాటింగ్‌లోనైనా సత్తా చాటుతున్నారు. ఇక బ్యాటింగ్‌లో టాపార్డర్లో సాహా, శుభ్‌మన్ గిల్ నిలదొక్కుకుంటే.. స్కోరు బోర్డు పరుగెత్తడం ఖాయం.. ఇక మూడో స్థానంలో బరిలో దిగుతున్న హార్దిక్ పాండ్యా మంచి ఫామ్‌లో ఉన్నాడు.
దీంతో ఆర్సీబీ కంటే.. గుజరాత్ టైటాన్స్ జట్టే పటిష్ఠంగా కన్పిస్తుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ పరంగా ఆర్సీబీ తన జట్టులో ఓ మార్పు చేస్తున్నట్లు తెలుస్తోంది. వరుస మ్యాచ్‌ల్లో నిరాశపర్చుతున్న ప్రభుదేశాయి స్థానంలో మహిపాల్ లోమ్రోర్‌ను తుది జట్టులోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా గుజరాత్ టైటాన్స్ మాత్రం తమ గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే కొనసాగించే వీలుంది.
గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రాబబుల్ ప్లేయింగ్ XIజట్లు
గుజరాత్ టైటాన్స్ : వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శుభ్‌మాన్ గిల్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అభినవ్ మనోహర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, లాకీ ఫెర్గూసన్, యశ్ దయాల్, మహమ్మద్ షమీ
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, రజత్ పటీదార్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), వనిందు హసరంగా, హర్షల్ పటేల్, జోష్ హేజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్