Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCB Playing 11 For IPL 2022: ఓపెన‌ర్‌గా కొత్త మోహం, మిడిలార్డ‌ర్ వారితో భ‌ర్తీ.. బ‌లంగా బౌలింగ్ యూనిట్‌

RCB Playing 11 For IPL 2022: Anuj Rawat debut as an opener.. The bowling unit is strong

బెంగ‌ళూరు: స‌రిగ్గా మ‌రో 10 రోజుల్లో ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) ప్రారంభం కానుంది. దీంతో జ‌ట్ల‌న్నీ ఇప్ప‌టికే త‌మ ప్రాక్టీసు షురూ చేశాయి. అలాగే ఇప్ప‌టి నుంచే మ్యాచ్‌లో మైదానంలోకి దింపాల్సిన త‌మ తుది జ‌ట్ల‌పై క‌స‌ర‌త్తు మొద‌లుపెట్టాయి. ఈ క్ర‌మంలో ఆట‌గాళ్లంద‌రి బ‌ల‌బ‌లాలు, ఫిట్‌నెస్ వంటి వాటిని ప‌రిశీలిస్తున్నాయి. అలాగే ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు కూడా త‌మ తుది జ‌ట్టు ఎంపిక‌పై దృష్టిపెట్టింది.

ఆర్సీబీ పూర్తి జ‌ట్టు ఇదే

ఆర్సీబీ పూర్తి జ‌ట్టు ఇదే

విరాట్ కోహ్లీ (15 కోట్లు), మ్యాక్స్‌వెల్ (11 కోట్లు), మహమ్మద్ సిరాజ్ (7 కోట్లు), వానిందు హసరంగ (10.75 కోట్లు), హర్షల్‌ పటేల్ (10.75 కోట్లు), డుప్లెసిస్ ( 7 కోట్లు), దినేశ్‌ కార్తీక్ (5.5 కోట్లు), జోష్‌ హేజిల్ వుడ్ (7.75 కోట్లు), షాబాజ్‌ అహ్మద్ (2.4 కోట్లు), అనుజ్‌ రావత్ (3.4 కోట్లు), డేవిడ్‌ విల్లే ( 2 కోట్లు), షెర్ఫానే రూథర్‌ఫోర్డ్ (కోటి) మహిపాల్‌ లామ్రోర్ (95 లక్షలు), ఫిన్‌ అలెన్ ( 80 లక్షలు), జేసన్‌ బెహ్‌రెండోర్ఫ్ ( 75 లక్షలు), సిద్ధార్థ్‌ కౌల్ (75 లక్షలు), కర్ణ్‌ శర్మ (50 లక్షలు), చామ మిలింద్ (25 లక్షలు), సుయాశ్‌ ప్రభుదేశాయ్ (30 లక్షలు), ఆకాశ్‌ దీప్‌, అనీశ్వర్‌ గౌతమ్‌, లువ్‌నిత్‌ సిసోడియా(వీరంద‌రికీ 20 లక్షలు).

ఓపెన‌ర్లుగా వీళ్లే

ఓపెన‌ర్లుగా వీళ్లే

మొత్తం 22 మంది స‌భ్యులు గ‌ల రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టులో తుది జ‌ట్టును ఎంపిక చేయ‌డ‌మంటే క‌త్తి మీద సామే అని చెప్పుకోవాలి. ఇక ఓపెన‌ర్లుగా కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, అనుజ్‌ రావత్ దిగ‌డం ఖాయ‌మైంది. ఐపీఎల్‌లో ఓపెన‌ర్‌గా డుప్లెసిస్‌కు కావాల్సిన అనుభవం ఉంది. గ‌తేడాది ఓపెన‌ర్‌గానే ఆడిన డుప్లిసెస్ చెన్నైసూప‌ర్ కింగ్స్ టైటిల్ గెల‌వ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు. ఇక జ‌ట్టు అవ‌స‌రాల‌కు త‌గ్గట్టుగా డుప్లిసెస్ మిడిలార్డ‌ర్‌లో కూడా బ్యాటింగ్ చేయ‌గ‌ల‌డు. దేశాళీ లీగ్‌ల్లో స‌త్తా చాటిన అనుజ్‌ రావత్ ఐపీఎల్‌లో ఎలా ఆడ‌తాడ‌నేది చూడాల్సి ఉంది. గ‌తంలో ఐపీఎల్‌లో 2 మ్యాచ్‌లు ఆడిన‌ప్ప‌టికీ బ్యాటింగ్ చేసే అవ‌కాశం రాలేదు.

మిడిలార్డ‌ర్ల‌లో ఎవ‌రెవ‌రంటే

మిడిలార్డ‌ర్ల‌లో ఎవ‌రెవ‌రంటే

ఇక మూడో స్థానంలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాయంగా కాగా గ్లెయిన్ మాక్స్‌వెల్ నాల్గో స్థానంలో ఆడ‌నున్నాడు. అయితే పెళ్లి కార‌ణంగా మాక్స్‌వెల్ ప‌లు ఆరంభ మ్యాచ్‌ల‌కు దూరం కానున్నాడు. దీంతో ఆ మ్యాచ్‌ల్లో మాక్స్‌వెల్ స్థానంలో షెర్ఫానే రూథర్‌ఫోర్డ్ లేదా ఫిన్‌ అలెన్ ఆడ‌నున్నారు. ఐదో స్థానంలో మహిపాల్‌ లామ్రోర్ రానున్నారు. వికెట్ కీపింగ్ బాధ్య‌త‌ల‌ను దినేశ్ కార్తీక్ చేప‌ట్ట‌నుండ‌గా.. అత‌డు ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయ‌నున్నాడు. ఆల్‌రౌండ‌ర్‌ షాబాజ్‌ అహ్మద్ ఏడో స్థానంలో బ్యాటింగ్ చేయ‌నున్నాడు.

బౌల‌ర్లుగా వీళ్లే

బౌల‌ర్లుగా వీళ్లే

బౌల‌ర్లుగా శ్రీ‌లంక స్పిన్న‌ర్ హ‌స‌రంగ‌తోపాటు హ‌ర్ష‌ల్ ప‌టేల్, మ‌హ్మ‌ద్ సిరాజ్ బ‌రిలోకి దిగ‌నున్నారు. అలాగే జోష్‌ హేజిల్ వుడ్, విల్లీ, జేస‌న్‌లో ఒక‌రు బ‌రిలోకి దిగ‌నున్నారు. ఆల్‌రౌండ‌ర్ కోటాను మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మ‌ద్ భ‌ర్తీ చేయ‌నున్నారు. మహ్మ‌ద్ సిరాజ్, హ‌ర్ష‌ల్ ప‌టేల్ గ‌త సీజ‌న్లో అద‌ర‌గొట్టారు. దీంతో ఈ సారి ఆర్సీబీ రిటెన్ష‌న్ జాబితాలో హైదారాబాదీ పేస‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్‌కు చోటు ద‌క్కింది. కాగా ఆర్సీబీ బౌలింగ్ యూనిట్ బ‌లంగా కనిపిస్తోంద‌ని అభిమానులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే అంతా బాగున్న ఆర్సీబీ మిడిలార్డ‌ర్ కాస్త బ‌ల‌హీనంగా క‌నిపిస్తోంద‌ని క్రికెట్ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

IPL 2022 : RCB Officially Announced Faf du Plessis As Captain | Oneindia Telugu
ఆర్సీబీ తుది జ‌ట్టు

ఆర్సీబీ తుది జ‌ట్టు

ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్‌), అనుజ్‌ రావత్, విరాట్ కోహ్లీ, గ్లెయిన్‌ మాక్స్‌వెల్ లేదా రూథర్‌ఫోర్డ్, మహిపాల్‌ లామ్రోర్, దినేష్ కార్తీక్ (వికెట్ కీప‌ర్‌), షాబాజ్‌ అహ్మద్, వానిందు హసరంగ, హర్షల్ ప‌టేల్, జోష్ హేజిల్‌వుడ్ లేదా జాస‌న్, మ‌హ్మ‌ద్ సిరాజ్‌.

Story first published: Wednesday, March 16, 2022, 11:18 [IST]
Other articles published on Mar 16, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+