Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అంతర్జాతీయ క్రికెట్ నుంచి విరామం తీసుకున్న ఆర్‌సీబీ ఆల్‌రౌండర్‌! కరోనాకు బయపడ్డాడా?

RCB player Daniel Sams takes a break from international cricket
Wi Vs Aus 2021 : ఆసీస్ Playing XI, Warner ఈజ్ బ్యాక్ Action Packed Series || Oneindia Telugu

సిడ్నీ: వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌ కోసం ఆస్ట్రేలియా జట్టును క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించింది. 23 మందితో కూడిన ప్రాథమిక జట్టును సోమవారం ఆస్ట్రేలియా సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది. స్టార్‌ ఆటగాళ్లు మళ్లీ జట్టులోకి వచ్చారు. ఇటీవల న్యూజిలాండ్‌తో టూర్‌కు దూరమైన స్టీవ్‌ స్మిత్‌, మిచెల్‌ స్టార్క్‌, జోష్‌ హేజిల్‌వుడ్‌, డేవిడ్‌ వార్నర్‌, పాట్‌ కమిన్స్‌ మళ్లీ జట్టులోకి వచ్చారు. కొంతమంది ఆటగాళ్లు ఈ పర్యటనకు దూరమయ్యారు. అందులో ఆర్‌సీబీ ఆల్‌రౌండర్‌ డేనియల్ సామ్స్ ఉన్నాడు.

మానసిక కారణాలతో:

మానసిక కారణాలతో:

డేనియల్ సామ్స్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి కాస్త విరామం తీసుకున్నాడట. ఐపీఎల్ 2021 అర్ధాంతరంగా ఆగిపోవడంతో అష్టకష్టాలు పడిన ఆసీస్ ప్లేయర్స్ ఈరోజు ఇళ్లకు చేసురుకున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించిన డేనియల్ సామ్స్ మాల్దీవుల ద్వారా సిడ్నీ చేరుకున్నాడు. వ్యక్తిగత మరియు మానసిక కారణాల వల్ల వెస్టిండీస్‌ పర్యటన కోసం తనను పరిగణనలోకి తీసుకోవద్దని క్రికెట్‌ ఆస్ట్రేలియాను కోరాడట. దీంతో సీఏ అతడిని విండీస్ పర్యటనకు ఎంపికచేయలేదు. ఐపీఎల్ కంటే ముందు న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో డేనియల్ ఆడాడు.

14వ సీజన్‌కు ముందే కరోనా:

14వ సీజన్‌కు ముందే కరోనా:

2020 డిసెంబర్‌లో సిడ్నీలో భారత్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో డేనియల్ సామ్స్ ఆస్ట్రేలియా తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. బిగ్ బాష్ లీగ్ ఫ్రాంచైజీ సిడ్నీ థండర్స్ తరఫున అద్భుత ప్రదర్శన చేయడంతో అతడికి ఈ అవకాశం వచ్చింది. ఆసీస్ తరఫున ఇప్పటివరకు నాలుగు టీ20లలో ఆడాడు. 4 వికెట్లతో పాటు 234.78 స్ట్రైక్ రేట్‌లో 54 పరుగులు కూడా చేశాడు. అయితే ఐపీఎల్ 14వ సీజన్‌కు ముందే సామ్స్ కరోనా బారిన పడి కోలుకున్నాడు. దీంతో 'కరోనాకు సామ్స్ ఏమైనా బయపడ్డాడేమో' అని సోషల్ మీడియాలో నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు.

జూలైలో విండీస్‌ టూర్‌కు:

జూలైలో విండీస్‌ టూర్‌కు:

అరోన్‌ ఫించ్‌ సారథ్యంలోని ఆసీస్‌ జట్టు జూలైలో విండీస్‌ టూర్‌కు వెళ్లనుంది. ఈ పర్యటనలో ఆతిథ్య వెస్టిండీస్‌తో ఆస్ట్రేలియా 3 వన్డేలు, 5 టీ20లు ఆడనుంది. ఈ ఏడాది చివర్లో భారత్‌ వేదికగా జరిగే టీ20 వరల్డ్‌కప్‌నకు విదేశీ జట్లు ఇప్పటినుంచే సన్నద్ధమవుతున్నాయి. అందుకోసం టీ20 సిరీస్‌లను ఎక్కువగా ఆడుతున్నాయి. భారత్ కూడా శ్రీలంకతో మూడు టీ20 ఆడనున్న విషయం తెలిసిందే.

ఆస్ట్రేలియా జట్టు:

ఆస్ట్రేలియా జట్టు:

ఆరోన్‌ ఫించ్‌ (కెప్టెన్‌), ఆస్టన్‌ అగర్‌, జేసన్‌ బెహ్రెరెన్డార్ఫ్‌, అలెక్స్‌ క్యారీ, పాట్‌ కమిన్స్‌, జోష్‌ హేజిల్‌వుడ్‌, మోసిస్‌ హెన్రిక్స్‌, మిచెల్‌ మార్ష్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, రిలే మెరిడిత్‌, జోష్‌ ఫిలిప్‌, కేన్‌ రిచర్డ్‌సన్‌, జై రిచర్డ్‌సన్‌, తన్వీర్‌ సంఘా, డి షార్ట్‌, స్టీవ్‌ స్మిత్‌, మిచెల్‌ స్టార్క్‌, మార్కస్‌ స్టోయినిస్‌, మిచెల్‌ స్వెప్సన్‌, అండ్రూ టై, మాథ్యూ వేడ్‌, డేవిడ్‌ వార్నర్‌, ఆడమ్‌ జంపా.

Story first published: Monday, May 17, 2021, 20:38 [IST]
Other articles published on May 17, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+