Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆర్సీబీ స్టార్ సంచలన నిర్ణయం.. క్రికెట్ బోర్డుపై కోర్టులో కేసు!

ఐపీఎల్ 2026 సీజన్ ఉత్కంఠభరితంగా కొనసాగుతున్న నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర(ఆర్సీబీ) జట్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆర్సీబీ స్టార్ పేసర్, శ్రీలంకకు చెందిన నువాన్ తుషారా తన దేశ క్రికెట్ బోర్డుపై కోర్టులో కేసు వేశారు. ఐపీఎల్ ఆడేందుకు తనకు నో ఆబ్జెక్షన్ సరిఫికేట్(ఎన్వోసీ) నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ నువాన్ తుషారా ఈ నిర్ణయం తీసుకున్నాడు.

ఫిట్‌నెస్ సాకుతో ఎన్వోసీ నిరాకరణ
నువాన్ తుషారా ఐపీఎల్ 2026లో పాల్గొనేందుకు శ్రీలంక క్రికెట్ బోర్డును అనుమతి కోరగా.. బోర్డు నిర్దేశించిన ఫిట్‌నెస్ ప్రమాణాలను ఆయన అందుకోలేదనే కారణంతో ఎన్వోసీని నిరాకరించింది. అయితే తన కెరీర్ అంతటా తన ఫిట్‌నెస్ స్థాయిలు ఇలాగే ఉన్నాయని.. గతంలో ఇదే ఫిట్‌నెస్‌తో ఆడినప్పుడు నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చిన బోర్డు.. ఇప్పుడు నిరాకరించడం అన్యాయమని నువాన్ తుషారా వాదిస్తున్నాడు. బోర్డు నిర్ణయం వల్ల తాను ఆర్థికంగా, కెరీర్ పరంగా ఎంతో నష్టపోతున్నానని తుషారా ఆవేదన వ్యక్తం చేశాడు.

RCB Pacer Nuwan Thushara Files Court Case Against Sri Lanka Cricket Over IPL 2026 NOC Denial

అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్?
శ్రీలంక క్రికెట్ బోర్డుతో తనకున్న సెంట్రల్ కాంట్రాక్టు మార్చి 31తో ముగిసిందని.. దానిని పునరుద్ధరించుకోవడానికి తనకు ఇష్టం లేదని నువాన్ తుషారా స్పష్టం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుని ఫ్రీలాన్స్ క్రికెటర్‌గా కొనసాగాలని నువాన్ తుషారా భావిస్తున్నాడు. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ బోర్డు అధ్యక్షుడు శమ్మీ సిల్వా, కార్యదర్శి బందుల దిస్సానాయకే సహా ఇతర ఉన్నతాధికారులను ప్రతివాదులుగా చేరుస్తూ కొలంబో జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ కేసు విచారణను కోర్టు ఏప్రిల్ 9కి వాయిదా వేసింది.

ఆర్సీబీలో నువాన్ తుషారా ప్రయాణం
2025 ఐపీఎల్ వేలంలో నువాన్ తుషారాను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ. 1.6 కోట్లకు కొనుగోలు చేసింది. గత సీజన్‌లో ఆర్సీబీ ఛాంపియన్‌గా నిలిచినప్పుడు నువాన్ తుషారా జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. మలింగ తరహా బౌలింగ్ యాక్షన్‌తో అలరించే నువాన్ తుషారాకు ఆర్సీబీ అభిమానుల్లో మంచి క్రేజ్ ఉంది. ఒకవేళ కోర్టు నుంచి తుషారాకు అనుకూలంగా తీర్పు రాకపోతే.. ఆయన ఈ సీజన్ మొత్తానికి దూరం కావాల్సి ఉంటుంది.

విజయంతో ఆరంభించిన ఆర్సీబీ
ఓ పక్క నువాన్ తుషారా కోర్టు వివాదంలో చిక్కుకోగా.. మరోపక్క ఆర్సీబీ ఐపీఎల్ 2026 సీజన్‌ను ఘనంగా ప్రారంభించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో బెంగళూరు విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఆర్సీబీకి నువాన్ తుషారా వంటి కీలక బౌలర్ అందుబాటులో లేకపోవడం కొంత లోటే అని చెప్పాలి. కోర్టు తీర్పుపైనే ఇప్పుడు నువాన్ తుషారా ఐపీఎల్ భవిష్యత్తు ఆధారపడి ఉంది.

Story first published: Thursday, April 2, 2026, 15:21 [IST]
Other articles published on Apr 2, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+