Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బెంగళూరుకు RCB గుడ్ బై: ఇకపై.. !!

నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కీలక మ్యాచ్ ఆడబోతోంది. గుజరాత్ టైటాన్స్ తో తలపడబోతోంది. బెంగళూరు దీనికి వేదిక. ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ షెడ్యూల్ అయింది. సొంతగడ్డపై రాయల్ ఛాలెంజర్స్ కు ఇదే చివరి మ్యాచ్. ఇకపై ఆడే మ్యాచ్ లన్నీ కూడా అవుటాఫ్ బెంగళూరే. దీంతో ఈ మ్యాచ్ లో ఘన విజయం సాధించి సొంతగడ్డకు వీడ్కోలు చెప్పాలనే పట్టుదలతో ఉంది రజత్ పటిదార్ సేన.

ప్రస్తుతానికి ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో ఎనిమిది పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది ఆర్సీబీ. శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని గుజరాత్ టైటాన్స్ జట్టు ఆరు మ్యాచ్‌లు ఆడి, ఆరు పాయింట్లతో పట్టికలో ఏడో స్థానంలో ఉంది. సొంతగడ్డ చిన్నస్వామిలో జరిగే ఈ మ్యాచ్ రజత్ పటిదార్ నేతృత్వంలోని ఆర్సీబీకి చాలా కీలకం.

RCB Looks to Cap Off Home Campaign with Win vs Gujarat Titans eye winning farewell Bengaluru

ఆర్సీబీ బ్యాటర్లు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నప్పటికీ, బౌలింగ్ విభాగం మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది. ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పటిదార్, టిమ్ డేవిడ్ వంటి బ్యాటర్లు అదరగొడుతున్నారు. చిన్నస్వామి పిచ్‌కి అనుకూలమైన బౌలర్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఎంచుకోవడంలో ఆర్‌సీబీ చాలా జాగ్రత్తగా ఉండాలి. గుజరాత్ జట్టుకు సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కగిసో రబాడా వంటి బౌలర్లు ఉన్నప్పటికీ, బ్యాటర్లను ఎక్కువగా ఇబ్బంది పెట్టే స్పిన్నర్ రషీద్ ఖాన్.

అతను తన నాలుగు ఓవర్లలో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగలడు. ఆర్సీబీ బ్యాటర్లు అతని నాలుగు ఓవర్లను చాలా జాగ్రత్తగా ఎదుర్కోవాలి, అనవసరమైన రిస్క్‌లు తీసుకోకుండా సింగిల్స్, డబుల్స్ తీస్తూ స్ట్రైక్ రొటేట్ చేయాలి. తద్వారా ఇతర బౌలర్లపై దాడి చేసి పరుగులు రాబట్టడం సులువు అవుతుంది. రషీద్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవడం కీలక వ్యూహం. ఆర్సీబీకి మంచి ఓపెనింగ్ లభిస్తున్నప్పటికీ, మిడిల్ ఓవర్లల్లో ఆశించిన స్థాయిలో పరుగుల వేగం ఉండట్లేదు.

డాట్ బాల్స్ అధికంగా ఉండటం దీనికి ప్రధాన కారణం. చివర్లో భారీ స్కోరు సాధించాలంటే ఈ దశలో పరుగులు వేగంగా రావాలి. చిన్నస్వామి పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలమైనది కాబట్టి, ఆర్సీబీ ఈ మిడిల్ ఓవర్లలో రన్ రేట్‌ను పెంచడం ద్వారా భారీ స్కోర్ సాధించగలుగుతుంది.

Story first published: Friday, April 24, 2026, 14:39 [IST]
Other articles published on Apr 24, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+