
మ్యాక్స్‌వెల్‌కు పర్‌ఫెక్ట్ బ్యాకప్
స్నేహితుడి బర్త్‌డే పార్టీలో గాయపడిన ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ గతేడాది కూడా ఐపీఎల్‌లో అంతగా రాణించింది లేదు. ఈ క్రమంలోనే అతని స్థానాన్ని భర్తీ చేసే పర్‌ఫెక్ట్ ఆటగాడిని ఆర్సీబీ కొనుగోలు చేసింది. ఇంగ్లండ్ ఆటగాడు విల్ జాక్స్ కోసం ఏకంగా రూ.3.2 కోట్లు ఖర్చు చేసింది. జాక్స్ చేరికతో ఆర్సీబీ బలం పెరుగుతుందని కచ్చితంగా చెప్పొచ్చు. తన కెరీర్‌లో జాక్స్ కేవలం రెండు అంతర్జాతీయ టీ20లు మాత్రమే ఆడాడు. అయితే ప్రపంచ వ్యాప్తంగా వివిధ లీగుల్లో సత్తా చాటాడు. వైట్ బాల్ క్రికెట్‌లో అతని స్ట్రైక్ రేటు 154.39 ఉందంటేనే ఎంతటి విధ్వంసం సృష్టించాడో అర్థం చేసుకోవచ్చు. దానికితోడు అతను మంచి బౌలర్ కూడా.

మరింత బలంగా పేస్ బౌలింగ్
ఆర్సీబీ ప్రధాన బలాల్లో పేస్ బౌలింగ్ యూనిట్ ఒకటి. జోష్ హాజిల్‌వుడ్, మహమ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్ ముగ్గురూ అద్భుతమైన బౌలర్లే. కానీ వీళ్ల ముగ్గురిలో వేరియేషన్ పెద్దగా ఉండదు. దానికితోడు కొంతకాలంగా గాయాలతో హాజిల్‌వుడ్ తన మెరుపు కోల్పోయాడు. అదే సమయంలో బెహ్రెండాఫ్‌ను ఆర్సీబీ ట్రేడ్ చేసేసింది. దీంతో ఆ జట్టు వద్ద సరైన ఓవర్సీస్ పేసర్ లేకుండా పోయాడు. ఈ సమస్యను అధిగమించేందుకు రీస్ టాప్లేను కొనుగోలు చేసింది ఆర్సీబీ. అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన ఈ ఇంగ్లండ్ ఎడం చేతి వాటం పేసర్.. వన్ డైమెన్షనల్‌గా ఉన్న ఆర్సీబీ పేస్ యూనిట్‌కు కొత్త బలాన్ని చేకూర్చాడు. దీంతో మరో ప్రధాన సమస్యకు ఆర్సీబీ చెక్ పెట్టేసినట్లయింది.

ఎక్స్ ఫ్యాక్టర్
ఏ జట్టులో అయినా పొట్టి ఫార్మాట్‌లో ఎక్స్ ఫ్యాక్టర్ చాలా కీలకం. కొంత మంది ఆటగాళ్లు వరుసగా విఫలం అవతున్నా ఆయా జట్లు వాళ్లను ఆడించడానికి కారణం అదే. గతంలో ఆర్సీబీ వద్ద అలాంటి ఆటగాళ్లు లేరు. ఇప్పుడు ఆ సమస్యను కూడా ఆర్సీబీ అధిగమించింది. ఎక్స్ ఫ్యాక్టర్ ఆటగాళ్ల కోసం ఓవర్సీస్ ఆటగాళ్ల కోసం చూడకుండా.. దేశవాళీ ఆటగాళ్లను కొనుగోలు చేసింది. గతేడాది రజత్ పటీదార్ కూడా అలా తన సత్తా నిరూపించుకున్న ఆటగాడే అనే విషయం మరువకూడదు. ఈ ఏడాది ఆర్సీబీ కొత్తగా లోకల్ కుర్రాడు మనోజ్ భండాగేను కొనుగోలు చేసింది. అలాగే హిమాన్షు శర్మ, రజన్ కుమార్, సోనూ యాదవ్, అవినాష్ సింగ్ వంటి అనామక ప్లేయర్లను కొనేసింది. వీరిలో సోనూ యాదవ్, అవినాష్ సింగ్ ఇద్దరూ ప్రత్యేకం అని చెప్పాలి. ఈ పేస్ బౌలర్లు అద్భుతమైన ట్యాలెంట్ ఉన్న వాళ్లే కాదు. వీళ్లు బౌలింగ్ చేస్తున్న ఫుటేజీలు కూడా పెద్దగా ఎక్కడా దొరకలేదు. అలాంటి ఆటగాళ్ల సత్తా కూడా ఆర్సీబీ పట్టేయడం గమనార్హం.


Click it and Unblock the Notifications











