
నాలుగు మ్యాచుల్లో మూడింట విజయాలు..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటిదాకా ఆడిన నాలుగు మ్యాచ్‌లల్లో మూడింట విజయాలను అందుకుంది. అప్రతిహతంగా దూసుకెళ్తోంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచిందీ దమ్‌దార్ బెంగళూరు టీమ్. తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో తప్పితే.. మిగిలిన మూడింట్లోనూ బౌలర్లు ప్రత్యర్థి బ్యాటర్లకు షాక్ ఇచ్చారు.
జట్టుకు వరుస విజయాలను అందించారు. కోల్‌కత నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లల్లో బౌలర్లు తడాఖా చూపారు. బౌలర్లు, బౌలర్లు సమష్టిగా రాణించడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తిరుగులేని విజయాలను అందుకుంటోంది.

మరో గుడ్‌న్యూస్..
ఈ పరిణామాల మధ్య రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ..తన అభిమానులకు అద్దిరిపోయే వార్తను అందజేసింది. శాండిల్‌వుడ్‌లో టాప్ మూవీ ప్రొడక్షన్ హౌస్ హొంబలె ఫిల్మ్స్‌తో జట్టు కట్టినట్టు ప్రకటించింది. హొంబలె ఫిల్మ్స్ అధినేత, నిర్మాత విజయ్ కిరగందూర్‌తో కలిసి జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.
రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్‌ను నిర్మించింది ఈ నిర్మాణ సంస్థే. ఫస్ట్ పార్ట్‌కు సీక్వెల్‌గా నిర్మించిన కేజీఎఫ్ చాఫ్టర్ 2 ఈ నెల 14వ తేదీన విడుదల కానుంది. విడుదల తేదీకి కొద్దిరోజుల ముందే- హొంబలె ఫిల్మ్స్.. రాయల్ ఛాలెంజర్స్ ఫ్రాంఛైజీతో అసోసియేట్ అయినట్లు తెలిపింది.
అద్దిరిపోయే వీడియో క్లిప్ విడుదల..
ఈ విషయాన్ని వెల్లడించడానికి హొంబలె ఫిల్మ్స్ ప్రొడక్షన్ హౌస్.. ఓ అద్దిరిపోయే వీడియోను రూపొందించింది. దీన్ని తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. 1:23 సెకెండ్ల నిడివి ఉన్న ఈ వీడియో- కేజీఎఫ్ చాప్టర్ 2 ట్రైలర్‌కు ఏ మాత్రం తగ్గట్లేదు. కేజీఎఫ్ యాక్టర్స్.. ఆర్సీబీ ప్లేయర్లను మిక్స్ చేస్తూ దీన్ని చిత్రీకరించింది. పవర్‌ఫుల్ అధీరా క్యారెక్టర్‌లో నటించిన సంజయ్ దత్, ఆర్సీబీ కేప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, రవీనా టండన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, యష్, విరాట్ కోహ్లీల కాంబినేషన్‌ను ఇందులో అద్భుతంగా మిక్స్ చేశారు.

ఈ రెండు రంగాల్లో ఏలడానికే..
శాండిల్‌వుడ్‌లో టాప్ ప్రొడక్షన్ హౌస్‌గా కొనసాగుతోంది హొంబలె ఫిల్మ్స్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీతో జట్టు కట్టడం వల్ల అటు చిత్ర పరిశ్రమ, ఇటు స్పోర్ట్స్ సెగ్మెంట్‌లో జాయింట్‌గా ప్రమోషన్లు చేయడం, సినిమాలను నిర్మించడం, మల్టీ ఫార్మట్ కంటెంట్‌తో కూడిన షార్ట్ ఫిల్మ్‌లను షూట్ చేయడం.. వంటి కార్యక్రమాలను నిర్వహించుకునే వీలు ఉంటుంది. ఫిల్మ్ ఇండస్ట్రీ-స్పోర్ట్స్ సెక్టార్‌లో జాయింట్‌గా పలు కార్యక్రమాలను రూపొందించుకోవడానికి అవసరమైన యాక్షన్ ప్లాన్‌ను రూపొందించుకుంటామని తెలిపింది హొంబలె ఫిల్మ్స్.


Click it and Unblock the Notifications
