
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కి తొలి విజయం దక్కింది. యూపీ వారియర్జ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ గెలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టిన ఆర్సీబీ బౌలర్లు యూపీ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. దీంతో ఆ జట్టు పెద్ద స్కోరు చెయ్యలేకపోయింది.
ఆర్సీబీ బౌలర్లు ధాటికి బెంబేలెత్తిన యూపీ బ్యాటర్లు ఏమాత్రం ప్రతిఘటించలేకపోయారు. ఈ క్రమంలోనే యూపీ ఓపెనర్ దేవిక వైద్య (0) డకౌట్ అయింది. ఆ జట్టు కెప్టెన్ అలీసా హేలీ (1) కూడా దారుణంగా విఫలమైంది. ఇలాంటి సమయంలో కిరణ్ నవగిరే (22) నెమ్మదిగా ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేసింది. తహీలియా మెక్‌గ్రాత్ (2) విఫలమవగా.. గ్రేస్ హారిస్ (46) రాణించింది.

సిమ్రాన్ షేక్ (2) కూడా ఫెయిలవగా.. దీప్తి శర్మ (22), సోఫీ ఎక్సెల్‌టోన్ (12), శ్వేత సెహ్రావట్ (6), అంజలి శ్రావణి (8), రాజేశ్వరీ గైక్వాడ్ (12) పరుగులు మాత్రమే చేయగలిగారు. దీంతో ఆ జట్టు కేవలం 135 పరుగులకే ఆలౌట్ అయింది.
లక్ష్య ఛేదనలో ఆర్సీబీకి శుభారంభం దక్కలేదు. కెప్టెన్ స్మృతి మంధాన (0) ఈ మ్యాచ్‌లో డకౌట్ అయింది. మరో ఓపెనర్ సోఫీ డివైన్ (14) కూడా పెద్దగా రాణించలేదు. ఎలీస్ పెర్రీ (10) కూడా విఫలమవగా హెదర్ నైట్ (24) ఫర్వాలేదనిపించింది. ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన కణికా అహూజా (46) అద్భుతమైన ఆటతీరు కనబరిచింది. ఆమెకు రిచా ఘోష్ (31 నాటౌట్) జత కలవడంతో ఆర్సీబీ విజయం దిశగా సాగింది. శ్రేయాంక పాటిల్ (5 నాటౌట్)తో కలిసి రిచా జట్టును విజయ తీరాలకు చేర్చింది. ఇది డబ్ల్యూపీఎల్‌లో ఆర్సీబీకి తొలి విజయం కావడం గమనార్హం.