Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL ఫైనల్ తేదీ మార్చాలని RCB ఫ్యాన్స్ గొడవ..కారణం ఏంటంటే?

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఐపీఎల్-2024లో అత్యంత ప్రమాదకరమైన సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఉప్పల్‌లో ఓడించారు. ఇక ఆర్సీబీ పనైపోయిందనుకున్న తరుణంలో సత్తాచాటి తిరిగి ప్లేఆఫ్స్ రేసులోకి వచ్చారు. అయితే తొమ్మిది మ్యాచ్‌ల్లో రెండింట్లోనే గెలిచిన బెంగళూరు జట్టు తదుపరి దశకు చేరుకోవడం సంక్లిష్టమే. కానీ సాంకేతికంగా పోటీలోనే ఉన్నారు.

మిగిలిన మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే సీజన్ ముగిసేసరికి ఆర్సీబీ ఖాతాలో 14 పాయింట్లు చేరుతాయి. టాప్-3లో ఉన్న జట్లు ఎక్కువ మ్యాచ్‌లు గెలిస్తే బెంగళూరు సులభంగా ప్లేఆఫ్స్‌కు చేరుతుంది. అయితే ఆర్సీబీ ఫ్యాన్స్ నెట్టింట కొత్త డిమాండ్‌కు తెరదీశారు. ఐపీఎల్ ఫైనల్‌ను మే 26కు బదులుగా మే 25న నిర్వహించాలని పట్టుబడుతున్నారు.

RCB Fans Demand IPL Final Date Change Here s Why

దానికో స్పెషల్ కారణం ఉందని వివరిస్తున్నారు. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఆర్సీబీ కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించింది. పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్‌పై నెగ్గింది. అయితే పంజాబ్‌పై మార్చి 25న, ఎస్‌ఆర్‌హెచ్‌పై ఏప్రిల్ 25న బెంగళూరు గెలిచింది. దీంతో ప్రతి నెలలోనే 25వ తేదీ తమకు కలిసొస్తుందని, మే 25న ఐపీఎల్ ఫైనల్ నిర్వహించాలని పోస్టులు పెడుతున్నారు. ఇది కాస్త విడ్డూరంగా ఉన్నా, ఆర్సీబీ ఫ్యాన్స్ ఎమోషన్స్ కరెక్టే అని నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ఇదంతా జరగాలంటే ఆర్సీబీ ఫ్లే ఆఫ్స్‌కు చేరాలి కదా అని మరికొందరు వ్యంగ్యంగా అంటున్నారు

ఇక సన్‌రైజర్స్‌తో మ్యాచ్ విషయానికొస్తే.. ఆర్సీబీ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 206 పరుగులు చేసింది. రజత్ పటిదార్ (50; 20 బంతుల్లో, 2x4, 5x6) మెరుపు అర్ధశతకం సాధించాడు. కామెరూన్ గ్రీన్ (37*; 20 బంతుల్లో, 5x4) ఆకట్టుకున్నాడు. విరాట్ కోహ్లి (51; 43 బంతుల్లో, 4x4, 1x6) అర్ధశతకం అందుకున్నప్పటికీ నిదానంగా బ్యాటింగ్ చేశాడు. 118 స్ట్రైక్‌రేటుతో పరుగులు చేశాడు. హైదరాబాద్ బౌలర్లలో జయదేవ్ ఉనద్కత్ మూడు (3/30) వికెట్లు తీశాడు.

అనంతరం ఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 171 పరుగులు చేసింది. షాబాజ్ అహ్మద్ (40*; 37 బంతుల్లో, 1x4, 1x6) టాప్ స్కోరర్. అభిషేక్ శర్మ (31; 13 బంతుల్లో, 3x4, 2x6), ప్యాట్ కమిన్స్ (31; 15 బంతుల్లో, 1x4, 3x6) పోరాడారు. ఆర్సీబీ బౌలర్లలో కర్ణ్ శర్మ (2/29), కామెరూన్ గ్రీన్ (2/12) రెండు వికెట్లతో సత్తాచాటారు.

Story first published: Friday, April 26, 2024, 11:01 [IST]
Other articles published on Apr 26, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+