For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బెంగుళూరు-ఢిల్లీ మ్యాచ్: బ్యాట్‌తో యువరాజ్‌ని కొట్టబోయిన క్రిస్‌గేల్

By Nageswara Rao

బెంగుళూరు: యువరాజ్ సింగ్‌పైకి రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఓపెనర్ క్రిస్ గేల్ బ్యాటెత్తాడు. కోపంగా కాదు.... సరదాగానే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా ఆదివారం నాడు ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో బెంగుళూరు తలపడింది. ఇరు జట్లు మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోయింది.

దీంతో ఇరు జట్ల ఆటగాళ్లు పిచ్ నుంచి వెనుదిరుగుతున్నారు. ఈ సందర్భంలో మైదానంలో క్రిస్ గేల్, యువరాజ్‌ల మధ్య ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. యువరాజ్‌పై క్రిస్ గెల్ బ్యాటెత్తి కొట్టబోగా, యువరాజ్ తప్పించుకుంటూ పరుగెత్తాడు. ఈ సరదా సన్నివేశాన్ని స్టేడియానికి వచ్చిన అభిమానులు ఆసక్తిగా తిలకించారు.

RCB enter IPL 2015 playoffs after washout in Bengaluru

ఇక ఆదివారం బెంగళూరు-ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది. అంఫైర్లు ఇరు జట్లకూ చెరో పాయింట్‌ కేటాయించారు. దీంతో మొత్తం 16 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో నిలిచిన బెంగళూరు ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 187 పరుగులు చేసింది.

డికాక్‌ 69 పరుగులు, జేపీ డుమినీ 67 పరుగులతో చెలరేగారు. హర్షల్‌ పటేల్‌, యుజ్వేంద్ర చాహల్‌ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన బెంగళూరు 1.1 ఓవర్లలో 2/0తో స్కోరుతో ఉన్న సమయంలో వర్షం రావడంతో ఆటను నిలిపివేశారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+