Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WPL 2025: ఆర్సీబీ కథ కంచికి - ఈ సీజన్‌కు బైబై!

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) సీజన్ 3లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ ఉమెన్) కథ కంచికి చేరింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ గా బరిలోకి దిగిన ఆ జట్టు ప్లేఆఫ్స్‌ చేరకుండానే నిష్క్రమించింది. ఇప్పటికే ప్లేఆఫ్స్‌ నుంచి నిష్క్రమించిన యూపీ వారియర్స్‌.. పోతూపోతూ ఆర్సీబీని వెంట పెట్టుకుని తీసుకెళ్లిపోయింది. తాజాగా జరిగిన కీలక మ్యాచ్ లో ఆర్సీబీ.. యూపీ వారియర్స్ చేతిలో పోరాడి ఓడింది. అలా వరుసగా ఐదు ఓటములతో ఈ సీజన్ నుంచి నిష్క్రమించింది ఆర్సీబీ.

తృటిలో సెంచరీ మిస్..
తాజాగా జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్‌కు దిగిన యూపీ వారియర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 225 పరుగుల భారీ స్కోరు సాధించింది. డబ్ల్యూపీఎల్ చరిత్రలో ఇది అత్యధిక స్కోర్. జార్జియా వోల్‌ (56 బంతుల్లో 17 ఫోర్లు, 1 సిక్స్‌ సాయంతో 99 నాటౌట్‌;) విజృంభించి తృటిలో సెంచరీని మిస్ చేసుకుంది. కిరణ్‌ నవ్‌గిరే (16 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో 46) కాసేపు మెరుపులు మెరిపించింది. ఆర్సీబీ బౌలర్లలో జార్జియా వేర్‌హమ్‌ 2 వికెట్లు తీసింది.

RCB eliminate from wpl 2025 loss against UP Warriorz Georgia Voll s unbeaten 99

పోరాడిన ఫలితం దక్కలే...
ఛేదనలో రిచా ఘోష్‌ (33 బంతుల్లో 6×4, 5×6 సాయంతో 69) పోరాడినా ఫలితం దక్కలేదు. దీంతో ఆర్సీబీ 19.3 ఓవర్లలో 213 పరుగులకే ఆలౌట్ అయింది. స్మృతి మంధాన (4) మళ్లీ తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరింది. ఎలీస్‌ పెర్రీ (28), సబ్బినేని మేఘన (27) పర్వాలేదనిపించారు. ఆ తర్వాత రిచా ఘోష్‌ సిక్స్‌లతో చెలరేగి కాస్త ఆశలు రేపింది. కానీ ఆనంతరం ఆమె కూడా ఔట్ అయిపోయింది. చార్లీ డీన్‌ (9), జార్జియా వేర్‌హామ్‌ (17) కూడా నిరాశపరిచారు.

అప్పుడు 2 ఓవర్లలో 43 పరుగులు కావాల్సిన సమయంలో స్నేహ్‌రాణా (6 బంతుల్లో 2×4, 3×6 సాయంతో 26) ఎంట్రీ ఇచ్చింది. ముఖ్యంగా దీప్తి శర్మ వేసిన 19వ ఓవర్లో స్నేహ్‌ రాణా బాదుడికి మళ్లీ ఆశలు చిగురించాయి. 4, 6, 6, 4, 6, అవుట్‌ పరుగులు చేసింది. కానీ లాస్ట్ బాల్ కు స్నేహ్‌ భారీ షాట్ కు ప్రయత్నించి ఔట్‌ కావడంతో ఆర్సీబీ కథ ముగిసింది.

అద్భుతంగా ఉంది..
"రిచా అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. తర్వాత స్నేహ్‌ రాణా కూడా చెలరేగి ఆడింది. ఆమె పోరాటం అద్భుతంగా ఉంది. మాకు మరో గేమ్ మిగిలి ఉంది. మా వంతుగా బెస్ట్ గా ఆడి గొప్పగా ముగిస్తామని భావిస్తున్నాను" అని మ్యాచ్ తర్వాత స్మృతి మంధాన పేర్కొంది.

Story first published: Sunday, March 9, 2025, 8:49 [IST]
Other articles published on Mar 9, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+