Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మహమ్మద్ సిరాజ్‌ను భలే వెనకేసుకొచ్చిన ఆర్సీబీ డైరెక్టర్ మైక్ హెస్సెన్... ఈ సాల అది కోల్పోయాడట

RCB director Mike Hesson said Siraj will comeback strong again

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్రికెట్ డైరెక్టర్ మైక్ హెస్సన్.. ఆ జట్టు స్టార్ పేసర్ సిరాజ్‌ను భలే వెనకేసుకొచ్చాడు. IPL 2022సీజన్లో మహ్మద్ సిరాజ్ అత్యంత పేలవ ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. సిరాజ్ మరింత స్ట్రాంగ్‌గా కమ్ బ్యాక్ అవుతాడని మైక్ హస్సన్ తెలిపాడు. శుక్రవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన క్వాలిఫయర్ 2లో ఆర్సీబీ ఓడిపోయి.. ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం హెస్సన్ మాట్లాడుతూ.. ఈ ఏడాది సిరాజ్ కొంచెం ఆత్మవిశ్వాసం కోల్పోయాడని, అయినా పేసర్ మానసికంగా చాలా బలంగా ఉన్నాడని పేర్కొన్నాడు. ఈ సీజన్‌ను మరిచిపోయి తిరిగి మళ్లీ బలంగా వచ్చే సీజన్‌కు సిద్ధమవుతాడని పేర్కొన్నాడు.

అతని పేలవ ప్రదర్శన వల్ల చివరి లీగ్ మ్యాచ్‌లో సిరాజ్‌ను ఆర్సీబీ యాజమాన్యం తొలగించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ అతని మీద నమ్మకముంచి ప్లేఆఫ్ మ్యాచ్‌లో అతన్ని ఆర్సీబీ ఆడించింది. ఇక ప్లేఆఫ్‌ మ్యాచ్‌ల్లో సిరాజ్ జట్టు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని మాత్రం నిలుపుకోలేకపోయాడు. రెండు ప్లేఆఫ్ మ్యాచ్‌లలో కేవలం 1 వికెట్ మాత్రమే తీసుకుని.. 6 ఓవర్లలో 75 పరుగులు ఇచ్చాడు. శుక్రవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్‌లో 158పరుగుల లక్ష్యాన్ని డిఫెండ్ చేయడంలో ఆర్సీబీ బౌలర్లు విఫలమైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా పవర్‌ప్లేలో బౌలింగ్ వేసిన సిరాజ్ తన 2ఓవర్లలో 34పరుగులిచ్చాడు. అలాగే ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్‌లో 30సిక్సర్లు ఇచ్చిన తొలి బౌలర్‌గా సిరాజ్‌ రికార్డులకెక్కాడు. అతను ఈ సీజన్లో మొత్తం 31సిక్సర్లు ఇచ్చాడు. సిరాజ్ ఐపీఎల్ 2022 సీజన్లో ఆడిన 15 మ్యాచ్‌లలో 9వికెట్లు తీశాడు. 10.08ఎకానమీ రేటుతో బౌలింగ్ చేశాడు. 2021లో సిరాజ్ ఎకానమీ 6.78గా ఉండగా.. ఈ సీజన్లో దానికి విరుద్ధంగా భారీగా ఎకానమీ మెయింటెన్ చేశాడు. ఇక ఈ సీజన్లో సిరాజ్ వైఫల్యం అతనికి భవిష్యత్తులో అవకాశాలపై పడే అవకాశముంది.

మైక్ హెస్సెన్ మాట్లాడుతూ.. ఈ సీజన్లో గ్లెన్ మాక్స్‌వెల్, విరాట్ కోహ్లీల ప్రదర్శన పట్ల తాను సంతోషంగానే ఉన్నానని పేర్కొన్నాడు. ఐపీఎల్ 2022 సీజన్లో తమ జట్టు ఆటతీరు పట్ల సంతృప్తికరంగా ఉన్నట్లు చెప్పాడు. ఆర్సీబీ వరుసగా 3 సీజన్‌లలో ప్లేఆఫ్‌లకు చేరుకుంది కానీ.. ఈ సీజన్‌లోనే వారు ఎలిమినేటర్ గండాన్ని గట్టెక్కారు. అయినా క్వాలిఫయర్ 2లో మాత్రం ఆ జట్టు ఓడిపోయి టోర్నీ నుంచి వైదొలిగింది. ఇక గ్లెన్ మాక్స్‌వెల్ ఈ సీజన్లో బ్యాటింగ్, బౌలింగ్లో రాణించాడని హెస్సెన్ పేర్కొన్నాడు. మంచి స్ట్రైక్ రేట్ తో పాటు 30సగటుతో బ్యాటింగ్ చేశాడు. అలాగే బౌలింగ్లో ఓవర్‌కి 7పరుగుల ఎకానమీ మెయింటెన్ చేశాడని తెలిపాడు.

Story first published: Saturday, May 28, 2022, 15:34 [IST]
Other articles published on May 28, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+