Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సన్‌రైజర్స్ నయా ఆల్‌రౌండర్ సంచలనం..!

ఐపీఎల్ లో సీజన్లు మారుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 'కప్ కల' మాత్రం నెరవేరట్లేదు. అద్భుతంగా పోరాడినా దురదృష్టం వారిని ట్రోఫీ నుంచి దూరం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందుకే 'ఈ సాల కప్ నమదే' అంటూ ప్రతి ఏటా అదే నినాదంతో బెంగళూరు జట్టు బరిలోకి దిగుతూనే ఉంది.

అయితే RCB జట్టు గురించి మరో సెంటిమెంట్ ప్రచారంలో ఉంది. ఆ జట్టు నుంచి బయటకు వెళ్లిన ప్లేయర్లు సూపర్ ఫామ్ లోకి వస్తారని నెటిజన్లు ట్రోల్ చేస్తుంటారు. ఇప్పుడు దాన్ని నిజం చేస్తూ షాబాజ్ అహ్మద్ సెంచరీతో కదం తొక్కాడు.

RCB didnt want SHAHBAZ AHMED.But He hit a century in Vijay Hazare Trophy now

ఇటీవల ఐపీఎల్ లోని జట్లు తమ కొందరు ప్లేయర్లను వదులుకున్న విషయం తెలిసిందే. ఆల్ రౌండర్ షాబాజ్ అహ్మద్ ను RCB వదులుకుంది. అయితే షాబాజ్ ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో బెంగాల్ జట్టు తరపున ఆడుతున్నాడు. ఇవాళ హర్యానాతో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్ లో షాబాజ్ చెలరేగాడు. 118 బంతుల్లో 100 పరుగులు చేశాడు. బెంగాల్ జట్టులో రెండో అత్యధిక స్కోరు అభిషేక్ చేసిన 24 పరుగులే. దీన్ని బట్టి చెప్పొచ్చు.. బెంగాల్ జట్టును షాబాజ్ ఎలా ఆదుకున్నాడో!

షాబాజ్ స్థానంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్లేయర్ మయాంక్ దాగర్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులోకి తీసుకుంది. మయాంక్ దాగర్ కూడా ఆల్ రౌండరే. అయితే గత సీజన్ లో దాగర్ మూడు మ్యాచ్ ల్లో కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. మరోవైపు షాబాజ్ కూడా గత సీజన్ లో విఫలమయ్యాడు. ఐదు ఇన్నింగ్స్‌లలో ఒక వికెట్ మాత్రమే తీసుకోగా.. ఆరు ఇన్నింగ్స్‌లలో 42 పరుగులు చేశాడు. మయాంక్ దాగర్ కు SRH జట్టు రూ. 1.8 కోట్లు ఖర్చు చేయగా, RCB షాబాజ్ పై రూ. 2.4 కోట్లు ఖర్చు పెట్టింది

బెంగళూరు వదులుకున్న ప్లేయర్లు: హసరంగ, హర్షల్‌, హేజిల్‌వుడ్‌, ఫిన్‌ అలెన్‌, బ్రేస్‌వెల్‌, విల్లీ, పార్నెల్‌, సోను యాదవ్‌, షాబాజ్‌ అహ్మద్‌ (బదులుగా మయాంక్‌ దాగర్‌), అవినాశ్‌ సింగ్‌, సిద్ధార్థ్‌ కౌల్‌, కేదార్‌ జాదవ్‌

Story first published: Monday, December 11, 2023, 13:48 [IST]
Other articles published on Dec 11, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+