Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రాయల్ ఛాలెంజర్స్ కొత్త కేప్టెన్ అతనే: జట్టులోకి తీసుకుంది అందుకోసమే: హింట్ ఇచ్చిన కోచ్

RCB Coach Mike Hesson Hints Faf Du Plessis As New Captain For Bangalore

బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్, 15వ ఎడిషన్‌ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సమాయాత్తమౌతోంది. గత ఆదివారం ముగిసిన వేలంపాట సందర్భంగా జట్టులోకి తీసుకున్న క్రికెటర్ల బలాబలాలపై విశ్లేషణలను మొదలు పెట్టింది. గ్రౌండ్‌లో దిగే జట్టు కూర్పు ఎలా ఉండాలనే విషయంపై ఇప్పటి నుంచే కసరత్తు ఆరంభించింది. ప్లేయింగ్ 11లో ఎవరెవరిని తీసుకోవాలి?.. వారిని ఎలా రొటేట్ చేయాలనే విషయంపై దృష్టి సారించింది.

కీలక సెషన్..

కీలక సెషన్..

ఇందులో భాగంగా హెడ్ కోచ్ మైక్ హెస్సెన్ ఓ సెషన్‌ను ఏర్పాటు చేశారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్‌ను ఇచ్చారు. సపోర్టింగ్ కోచ్, అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ ఇందులో పాల్గొన్నారు. ఈ సెషన్‌లో మైక్ హెస్సెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేకించి- జట్టు సారథ్య బాధ్యతలను ఎవరికి అప్పగించాలనే విషయంపై ఇందులో చర్చించారు. విరాట్ కోహ్లీ కేప్టెన్సీ పదవి నుంచి తప్పుకొన్న నేపథ్యంలో అతని వారసుడిగా ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై వారి నుంచి అభిప్రాయాలను సేకరించారు.

ఫాప్ అనుభవాన్ని వినియోగించుకుంటామంటూ..

ఫాప్ అనుభవాన్ని వినియోగించుకుంటామంటూ..

దీనికి సంబంధించిన ఓ వీడియో క్లిప్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ మేనేజ్‌మెంట్.. తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ఈ సెషన్ సందర్భంగా మైక్ హెస్సెన్ చేసిన వ్యాఖ్యలు చూస్తోంటే- జట్టు కేప్టెన్‌గా ఫాప్ డుప్లెసిస్‌ను నియమించాలనేది దాదాపుగా ఖరారైనట్టేనని తెలుస్తోంది. విరాట్ కోహ్లీ తరువాత ఆ స్థాయిలో అనుభవజ్ఞుడు డుప్లెసిస్సేనని స్పష్టం చేశారు. కేప్టెన్సీ బాధ్యతలను అతనికి అప్పగించాలనే ఉద్దేశంతోనే జట్టులోకి తీసుకున్నామని స్పష్టం చేశారు.

థింక్ ట్యాంక్స్ అతని వైపే

థింక్ ట్యాంక్స్ అతని వైపే

జట్టు కేప్టెన్‌గా ఎవరిని నియమించాలనేది అత్యంత కీలకమైన నిర్ణయమని, దీనికోసం సమష్టి నిర్ణయాన్ని తీసుకోక తప్పదని మైక్ అభిప్రాయపడ్డారు. థింక్ ట్యాంక్స్ అందరూ డుప్లెసిస్ వైపే మొగ్గు చూపారని పేర్కొన్నారు. అతని అనుభవం, నాయకత్వ విలువలను పరిగణనలోకి తీసుకున్న తరువాతే జట్టులో చోటు కల్పించామని స్పష్టం చేశారు. అతని అనుభవం జట్టుకు ఉపయోగపడుందని వ్యాఖ్యానించారు. అతని అనుభవం, ప్రతిభ.. జట్టును నడిపిస్తుందని అన్నారు.

 డుప్లెసిస్‌పై డిబేట్స్..

డుప్లెసిస్‌పై డిబేట్స్..

రిటైన్ చేసుకున్న విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహ్మద్ సిరాజ్‌‌తో పాటు కొత్తగా ఎనిమిది మంది ప్లేయర్లు రాయల్ ఛాలెంజర్స్‌లో ఎంట్రీ ఇచ్చారు. చెన్నై సూపర్ కింగ్స్‌లో సుదీర్ఘకాలం పాటు కొనసాగిన దక్షిణాఫ్రికా స్టార్ ఓపెనర్ ఫాప్ డుప్లెసిస్‌ను కొత్తగా టీమ్‌లో చోటు కల్పించింది. ఈ సెలెక్షన్ అందరి దృష్టినీ ఆకర్షించింది. డుప్లెసిస్‌ను టీమ్‌లో తీసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది.

టీ20 ఫార్మట్‌ స్పెషలిస్ట్..

టీ20 ఫార్మట్‌ స్పెషలిస్ట్..

ఐపీఎల్, టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లను ఆడిన అనుభవం ఉన్న డుప్లెసిస్‌కు కేప్టెన్సీ పగ్గాలను అప్పగించడానికే అతణ్ని జట్టులోకి తీసుకుందని అభిప్రాయాలు అప్పుడే వ్యక్తం అయ్యాయి. వంద ఐపీఎల్ మ్యాచ్‌లను ఆడాడు ఫాప్. 2012 నుంచీ చెన్నై సూపర్ కింగ్స్‌తో కొనసాగాడు. ఆ జర్నీకి ఇప్పుడు బ్రేక్ పడింది. రాయల్ ఛాలెంజర్స్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఫాప్‌ను మళ్లీ జట్టులోకి తీసుకోవడానికి సీఎస్‌కే ప్రయత్నించినా.. తన పట్టును వదల్లేదు ఆర్సీబీ.

Story first published: Sunday, February 20, 2022, 13:41 [IST]
Other articles published on Feb 20, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+