Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: మ్యాచ్‌కు ముందు కేకేఆర్‌‌కు వార్నింగ్ ఇచ్చిన ఆర్సీబీ కోచ్!

IPL 2025 KKR VS RCB : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 వచ్చేసింది. ఈడెన్‌గార్డెన్స్‌ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ - రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ కోచ్ ఆండీ ఫ్లవర్‌.. కోల్‌కతా జట్టుకు వార్నింగ్ ఇచ్చాడు.

తాజాగా ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఆండీ ఫ్లవర్ కు 'కోల్‌కతా నుంచి ఆర్సీబీకి ఇబ్బందులు తప్పవా?' అని ఓ ప్రశ్న ఎదురవ్వగా... అతడు దీటైనా‌ సమాధానం ఇచ్చాడు. "అవును, ఈ మ్యాచ్‌ ఎంతో భయంకరంగా ఉండనుంది. హోరాహోరీగా ఉండబోతుంది. అయితే ఆ ఇబ్బందులు మా నుంచి కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు తప్పవు. ఐపీఎల్ 2025 సీజన్‌ గొప్పగా ప్రారంభం కానుందని భావిస్తున్నా. మేమంతా మా కొత్త కెప్టెన్ రజత్ పటీదార్‌కు అండగా ఉన్నాం. జట్టును పూర్తిగా అనుభవం నిండిన ఆటగాళ్లతో నింపేశాం. అతడు కూడా ఈ సవాల్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాడు. అతడి వెనకాల మేమున్నాం." అని ఆండీ ఫ్లవర్‌ పేర్కొన్నాడు.

RCB Coach Andy Flower warns kolkata Knight Riders ahead of KKR VS RCB IPL 2025

అప్పుడే మా బలం తెలుస్తుంది..
"కోల్‌కతా టీమ్ లో వరుణ్‌ చక్రవర్తి, సునీల్ నరైన్ రూపంలో అద్భుతమైన స్పిన్నర్లు ఉన్నారు. చక్రవర్తి గత మంచి ఫామ్ లో ఉన్నాడు. నరైన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచలోని అత్యుత్తమ జట్టుతో ఆడినప్పుడే మనమేంటో, మన బలమేంటో తెలుస్తుంది. అంతర్జాతీయ క్రికెట్ అయినా లేదా ఐపీఎల్ అయినా ఇదే చేయాలి."

కోహ్లీ లాంటి ప్లేయర్లకు...
"ఐపీఎల్ లో భారీ స్కోర్లు నమోదు అవ్వడం ట్రెండ్‌గా మారిపోయింది. బ్యాటర్లు బలంగా మారిపోతూ మరింత గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అలానే విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్లు ఐపీఎల్ లో మంచి స్థానం ఉంది. అతడు సూపర్ ఫిట్ గా ఉన్నాడు. బలమైన కుర్రాడిలా ఉన్నాడు. హై క్వాలిటీ, తెలివైన క్రికెటర్లకు ఐపీఎల్ లో మంచి చోటు ఉంది." అని ఆండీ ఫ్లవర్ పేర్కొన్నాడు.

Story first published: Saturday, March 22, 2025, 9:52 [IST]
Other articles published on Mar 22, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+