బెంగుళూరు:ఢిల్లీ డేర్ డెవిల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఆదివారం జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఢిల్లీ బ్యాటింగ్ అనంతరం, బెంగళూరు 1.1 ఓవర్లు ఆడాక వర్షం పడటంతో మ్యాచ్ రద్దయింది. దీంతో చెరో పాయింట్ వచ్చింది.
టాస్ గెలిచిన బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకోగా, మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్లకు 187 పరుగులు చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (69), కెప్టెన్ జీన్ పాల్ డుమినీ (67 నాటౌట్) అర్ధ సెంచరీలు సాధించారు. బెంగళూరు బౌలర్లలో హర్షల్ పటేల్, యజువేంద్ర చాహల్ చెరి రెండేసి వికెట్లు పడగొట్టారు.
అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన బెంగళూరు 1.1 ఓవర్లలో వికెట్ నష్టం లేకుండా రెండు పరుగులు చేసింది. ఈ దశలో భారీ వర్షం కురవడంతో ఆటకు అంతరాయం ఏర్పడింది. కటాప్ సమయం ముగిసే వరకూ వర్షం తగ్గుముఖం పట్టకపోవడంతో మ్యాచ్‌ని రద్దు చేస్తున్నట్టు మ్యాచ్ రిఫరీ రంజన్ మదుగలే ప్రకటించాడు.
అంతకు ముందు ఫీల్డ్ అంపైర్లు కుమార ధర్మసేన, శ్రీనివాసన్ పలుమార్లు మైదానాన్ని పరిశీలించి, వాతావరణం ఆటకు అనుకూలిస్తే కనీసం ఐదు ఓవర్లు ఆడించే ప్రయత్నం చేశారు. కానీ, భారీ వర్షంతో వారి ప్రయత్నం ఫలించలేదు. ఇరు జట్లకు చెరొక పాయింట్ లభించింది. బెంగళూరు పాయింట్లు 16కు చేరుకోగా, ఢిల్లీ మొత్తం 11 పాయింట్లతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.

జట్ల వివరాలు:
రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూర్: విరాట్ కోహ్లీ (కెప్టెన్), ఎబి డి విలియర్స్, క్రిస్ గేల్, మిచెల్ స్టార్క్, నిక్ మాడిన్సన్, వరుణ్ ఆరోన్, అశోక్ దిండా, హర్షల్ పటేల్, విజయ్ జోల్, అబూ నెచిమ్, సందీప్ వారియర్, యోగేష్ టకావాలే, యుజ్వేంద్ర చాహల్, రిలీ రొస్సో, ఇక్బాల్ అబ్దుల్లా, మన్వీందర్ బిస్లా, మన్దీప్ సింగ్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), సుబ్రమణ్యం బద్రీనాథ్, డారెన్ సామీ, సీన్ అబోట్, డేవిడ్ వైసే, సర్ఫరాజ్ ఖాన్, జలజ్ సక్సేనా, శిశిర్ భవానే, శ్రీనాథ్
ఢిల్లీ డేర్ డెవిల్స్: జేపీ డుమినీ (కెప్టెన్), మహ్మద్ షమీ, క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), మనోజ్ తివారీ, కేదార్ జాదవ్ (వికెట్ కీపర్), మయాంక్ అగర్వాల్, షాబాజ్ నదీమ్, సౌరభ్ తివారీ, జయంత్ యాదవ్, ఇమ్రాన్ తాహిర్, నాథన్ కౌల్టర్ నైల్, ఏంజెలో మాథ్యూస్ యువరాజ్ సింగ్, అమిత్ మిశ్రా, జైదేవ్, గురిందర్ సంధు, శ్రేయాస్ అయ్యర్, గౌతం, ట్రావిస్ హెడ్, శ్రీకర్ భరత్, అల్బీ మోర్కెల్, మార్కస్ స్టోయిన్స్, జహీర్ ఖాన్, కేకే జియాస్, డొమినిక్ జోసెఫ్.