
వాలీబాల్ ప్రాక్టీస్:
యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు జరగనున్నాయి. దుబాయ్, అబుదాబి, షార్జా వేదికల్లో మొత్తం 53 రోజుల విండోలో 60 మ్యాచ్‌ల్ని నిర్వహించనున్నారు. లీగ్ కోసం ఇప్పటికే యూఏఈ చేరుకున్న అన్ని జట్లు బీసీసీఐ రూల్స్ ప్రకారం క్వారంటైన్ పూర్తిచేసుకుని ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఈ క్రమంలో గతవారం ఆర్సీబీ జట్టు సభ్యులు అందరూ కలిసి వాలీబాల్ ఆడారు. మ్యాచ్ జరుగుతుండగా కెప్టెన్ విరాట్ కోహ్లీ బంతిని మిస్టర్ నాగ్స్‌పైకి తన్నాడు. దాంతో నాగ్స్ అలిగాడు.

విదేశీ ఆటగాళ్లతోనే ఉంటా:
విరాట్ కోహ్లీ బంతిని తనపైకి తన్నాడని మిస్టర్ నాగ్స్ ఆర్సీబీ విడుదల చేసిన వీడియో చెప్పాడు. తనకు గాయాలయ్యాయని.. మళ్లీ వాళ్లతో కలిసి ఏ ఆటలు ఆడబోడనని స్పష్టం చేశాడు. ఇకపై విదేశీ ఆటగాళ్లతోనే ఉంటానని, వాళ్లతోనే మాట్లాడతానని నాగ్స్ పేర్కొన్నాడు. చెప్పిన విధంగానే భారత ఆటగాళ్లు పలకరించినా మాట్లాడలేదు. యుజ్వేంద్ర చహల్, పార్థివ్ పటేల్, ఉమేష్ యాదవ్, నవదీప్ సైనీ, పవన్ నెగిలు పలకరించినా.. నాగ్స్ పట్టించుకోలేదు.

కోహ్లీ పక్కన నిలబడినా:
విదేశీయుడిలా వేశధారణ మార్చుకొని కోచ్ సైమన్ కటిచ్, డేల్ స్టెయిన్, ఏబీ డివిలియర్స్‌తో మాట్లాడాడు. ఈ సందర్భంగా 'విరాట్ నా పట్ల ఏం చేశాడో నువ్వు చూశావు' అని డివిలియర్స్‌తో అనగా.. 'నిజమే నాగ్స్.. దారుణంగా ప్రవర్తించాడు' అని బదులిచ్చాడు. అనంతరం నాగ్స్.. కోహ్లీ పక్కన నిలబడినా పట్టించుకోలేదు. చివరికి అతడి వేషధారణ, జుట్టు రంగు బాగోలేదని కోహ్లీ జోక్ చేశాడు. అక్కడితో వీడియో ముగిసిపోయింది. అయితే ఇదంతా ఆ జట్టులో నాగ్స్ చేసే సందడి మాత్రమే. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది.
బెంగుళూరు విమానాశ్రయం నుంచే మొదలు:
ఐపీఎల్ 2020 కోసం బెంగుళూరు విమానాశ్రయం నుంచి ఆర్సీబీ బయలుదేరినప్పటి నుంచే మిస్టర్ నాగ్స్ సందడి మొదలైంది. అప్పుడే ఆటగాళ్లతో ప్రాంక్స్ చేశాడు. ఆటగాళ్లకు కరోనా పరీక్షలు ఎలా చేశారో సరదాగా వీడియోలో చూపించాడు. అలాగే జట్టుతో కలిసి విరాట్ కోహ్లీ ఎందుకు రాలేడని ఆటగాళ్లు అడిగిన ప్రశ్నకి.. అతడికి భారీ మొత్తంలో చెల్లిస్తున్నామని, ప్రత్యేకంగా వస్తాడని సరదాగా బదులిచ్చాడు.


Click it and Unblock the Notifications
